వాకింగ్ చేస్తే బరువు తగ్గుతారా? ముఖ్యంగా పొట్ట తగ్గుతుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. వాకింగ్ వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గడంతో పాటు అనేక ఆర్యోగ ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
pexels
By Bandaru Satyaprasad Jan 24, 2025
Hindustan Times Telugu
వంపులు తిరిగిన మార్గం - ట్రెడ్ మిల్ కంటే బయట నడక బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా వంపులు తిరిగిన మార్గాల్లో వాకింగ్ చేయడం వల్ల శరీర కొవ్వు తగ్గుతుంది. ఎత్తుపల్లాలు ఉన్న మార్గంలో వాకింగ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
pexels
మీ వాకింగ్ లో శరీర బరువు తగ్గే వ్యాయామాలు జోడించండి. ఈ వ్యాయామాలతో బెల్లీ ఫ్యాట్ ను సులభంగా కోల్పోతారు. స్క్వాట్‌లు, పుషప్‌లు, బర్పీస్ వంటి బాడీ వెయిట్ వర్కవుట్‌లను ప్రయత్నించండి. ఇవన్నీ మీ హార్ట్ బీట్ రేటును పెంచి రక్త ప్రసరణను వేగవంతం చేస్తాయి.
pexels
యాంకిల్ వెయిట్స్- చీలమండ బరువుతో నడవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కదలడానికి ఎక్కువ శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. మీ కాళ్లను టోన్ చేసి కండరాలను మరింత దృఢంగా చేస్తాయి.
pexels
తక్కువ కేలరీల ఆహారం - మీరు వాకింగ్ చేయడంతో పాటు తక్కువ కేలరీలుండే ఆహారాన్ని తీసుకోవాలి. తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటూ 12 వారాల పాటు రోజూ నడిస్తే శరీర కొవ్వును గణనీయంగా కోల్పోతారు.
pexels
నడకకు కారణాలు- నడకను మీ సాధారణ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. తక్కువ దూరాలకు వెళ్లేందుకు వాకింగ్ చేయండి. కిరాణా షాపులకు వెళ్లేటప్పుడు వాకింగ్ చేయడం, భోజనం తర్వాత నడక అలవాటు చేసుకోండి. మీ పెంపుడు జంతువులను వాకింగ్ కు తీసుకెళ్తూ ఉండండి.
pexels
కొత్త మార్గాలను అన్వేషించడం- ప్రతిరోజూ నడకకు వెళ్లేందుకు ఆసక్తికరమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోండి. దీంతో మీ సాధారణ నడకలు ఆసక్తికరంగా, విభిన్నంగా మారతాయి. నడకకు వెళ్లేందుకు కొత్త మార్గాలను అన్వేషించండి. మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు లేచి నడవడం అలవాటు చేసుకోండి.
pexels
రోజులో కనీసం 10 వేల అడుగులు నడిస్తే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. మంచి ఆహారం తీసుకుని, చెడు అలవాట్లకు దూరంగా ఉండే వ్యక్తులు రోజులో 4 వేల అడుగులు నడిచినా సరిపోతుంది. రోజులో కనీసం 30 నిమిషాలు మించకుండా బ్రిస్క్ వాకింగ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.