కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే ముందు ఇవి తప్పనిసరిగా చూడండి!

By Sudarshan V
Mar 06, 2025

Hindustan Times
Telugu

మీరు కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు ఇక్కడ ఉన్నాయి.

ముందుగా మీ స్మార్ట్ ఫోన్ అవసరాలను, మీ బడ్జెట్ ను నిర్ణయించుకోండి.

మీకు మంచి కెమెరా ఉన్న ఫోన్ కావాలా? ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఫోన్ కావాలా? లేదా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ కావాలా?

మీ అవసరాల ఆధారంగా ఏ బ్రాండ్ ఫోన్, ఏ బడ్జెట్ లో తీసుకోవాలో నిర్ణయించుకోండి.

మీరు ఫోన్‌లో గేమ్స్ ఆడటం ఇష్టపడేవారు కాకపోతే.. హై పర్ఫార్మెన్స్, ఎక్కువ ర్యామ్ ఉన్న ఫోన్ కోసం డబ్బులు ఖర్చు చేయడం అనవసరం.

తాజా డిస్ ప్లే టెక్నాలజీ ఉన్న ఫోన్ కొనండి. ఉదాహరణకు, మీ బడ్జెట్ రూ. 20 వేల వరకు ఉంటే, మీరు AMOLED డిస్ప్లే ఉన్న ఫోన్ కొనాలి.

5G కనెక్టివిటీ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలి. అదేవిధంగా, ఇతర లేటెస్ట్ టెక్నాలజీలపై కూడా దృష్టి పెట్టండి.

ఫోన్ కొనేముందు గూగుల్ లో, వివిధ ఈ కామర్స్ సైట్స్ లో ఆ ఫోన్ పై ఉన్న రివ్యూలను చదవండి.

మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతుందా? ఈ అనుమానం చాలా మందికి ఉంటుంది.

Image Credit Unsplash