ఆరోగ్యానికి బీట్ రూట్ మంచిదే.. కానీ ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి..

By Sudarshan V
Mar 25, 2025

Hindustan Times
Telugu

బీట్రూట్ లో ఫైబర్ తో పాటు చాలా పోషకాలు ఉంటాయి. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటితో పాటు కొన్ని దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి.

బీట్ రూట్ లో ఆక్సలేట్స్ ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ఇవి కారణమవుతాయి. అందుకే బీట్ రూట్ ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

వివిధ అధ్యయనాల ప్రకారం, బీట్రూట్ ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, గ్యాస్. విరేచనాలతో సహా జీర్ణశయ సమస్యలు వస్తాయి.

బీట్రూట్లో ఉండే బీటాలైన్స్ వల్ల మూత్రం, మలం ఎరుపు లేదా గులాబీ రంగులో కనిపిస్తాయి. ఇది హానికరమేం కాదు.

అధిక నైట్రేట్ కంటెంట్ కారణంగా, బీట్రూట్ రక్తపోటును తగ్గిస్తుంది. ఇది హైపోటెన్షన్ (బీపీ తగ్గడం) కు దారితీసే ప్రమాదం కూడా ఉంది.

బీట్ రూట్ లో ఉండే నిర్విషీకరణ ప్రభావాలు, అధిక చక్కెర కంటెంట్ కారణంగా, ఇది కాలేయ పనితీరులో ఇబ్బంది కలిగిస్తుంది.

బీట్రూట్లో గోయిట్రోజెన్లు ఉంటాయి. అవి థైరాయిడ్ పనితీరు, అయోడిన్ శోషణను నిరోధించే సమ్మేళనాలు. ఇది హైపోథైరాయిడిజానికి దారితీయొచ్చు.

ఈ కథనం సమాచారం కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాం.

విరాట్ కోహ్లీ రోజువారీ డైట్ రొటీన్ ఏముంటాయో తెలుసా?

Photo Credit: Instagram/@virat.kohli