అందమైన మెరిసే చర్మం ఎల్లప్పుడూ మీ సొంతం కావాలంటే కొన్ని రకాల పండ్లను ప్రతి రోజూ తినాలని సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు. ముఖ్యంగా 6 రకాల పండ్లు మిమ్మల్ని ఎప్పుడూ అందంగా, యవ్వనంగా ఉంచుతాయట.
మీ చర్మ ఆరోగ్యం మీరు తినే ఆహారాన్ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని రకాల పండ్లను ప్రతిరోజూ తినడం మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతగా తయారవుతుంది. అలా చర్మాన్ని అందంగా, ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేసే 6 రకాల పండ్ల గురించి తెలుసుకుందాం రండి..
Pixabay
ఆరెంజ్ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మానికి సహజమైన మెరుపును ఇవ్వడంలో ఇది సహాయపడుతుంది.
Pixabay
దానిమ్మ పండులో పాలిఫినాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా చర్మం ఎల్లప్పుడూ నిగనిగలాడుతూ, మెరుస్తూ ఉంటుంది.
canva
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది సూర్యకాంతి వల్ల కలిగే నష్టం, మొటిమలు, మచ్చలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. నిమ్మకాయ చర్మం మెరుపును కూడా పెంచుతుందని భావిస్తారు.
బొప్పాయి వంటి పీచు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మపు ఆరోగ్యాన్ని పెంచి, సహజమైన కాంతిని అందించడంలో సహాయపడతాయి.
స్ట్రాబెర్రీలు, బ్లాక్‌బెర్రీలు, బ్లూబెర్రీలు వంటి బెర్రీలలో విటమిన్లు A, Cలతో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా తయారు చేస్తాయి.
పైనాపిల్(అనాస పండు)లో చర్మానికి మేలు చేసే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల చర్మ నిర్మాణం మెరుగుపడుతుంది. మచ్చలను తగ్గించి, కాంతిని పెంచడంలో ఇది బాగా సహాయపడుతుంది.
Pixabay
ఈ పండ్లను రోజూ మితంగా తినడం వల్ల చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. నిత్యం యవ్వనంగా కనిపిస్తారని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
మీ చిన్నారికి తల్లిపాలు తాగించడానికి ఈ టిప్స్ పాటించండి!