రోజూ మనం తాగే పాలు ఆరోగ్యంగా ఉండటానికి మాత్రమే కాదు, అందంగా ఉండటానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. వేడి చేయకుండా నేరుగా పచ్చి పాలను ముఖానికి రాసుకోవడం అలవాటు చేసుకుంటే పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతున్నారు సౌందర్య నిపుణులు.
పాలలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలతో పాటు లాక్టిక్ యాసిడ్, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని కాపాడటానికి చక్కటి పదార్థంగా ఉపయోగపడతాయి.
పచ్చి పాలు చర్మాన్ని తేమగా ఉంచే మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయట. ఇవి చర్మాన్నికి మంచి ఏక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్‌గా పని చేస్తాయి.
ఇందులోని సహజమైన కొవ్వులు, ప్రోటీన్, నీటి శాతం చర్మానికి కావాల్సిన తేమను అందిస్తాయి. చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారేందుకు సహాయపడతాయి.
Pixabay
పచ్చిపాలు చర్మానికి తేమను అందించడం మాత్రమే కాదు.. చర్మపు రంధ్రాల్లో ఉండే అధిక తేమను తొలగించి సహజమైన మెరుపును అందిస్తాయి. జిడ్డును తొలగిస్తుంది.
Pixabay
విటమిన్లు A, D, E వంటి యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఐరన్ పుష్కలంగా ఉండే పచ్చి పాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. వృద్ధాప్య ఛాయలను దూరం చేసి యవ్వనంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.
Pixabay
పచ్చి పాలు ముఖంపై అప్లై చేయడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. సన్‌బర్న్, చర్మం వాపు, దద్దుర్లు వంటి సమస్యల నుంచి కూడా చక్కటి ఉపశమనం కలిగిస్తాయి.
Pixabay
ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ఖినిజాలు చర్మ రోగనిరోధకతను పెంచుతాయి. మృతకణాలను తగ్గించి చర్మాన్ని మృదువుగా,ఆరోగ్యవంతంగా తయారు చేస్తాయి.
Pixabay
బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారి పచ్చిపాలలో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేశారంటే దుమ్ము, దూళి, బ్యాక్టీరియా వంటివన్నీ తొలగిపోయి చర్మం లొతుల్లోంచి శుభ్రం అవుతుంది.
Pixabay
వారానికి కనీసం రెండు సార్లు పచ్చి పాలను ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.
Pixabay
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఆరోగ్యకరమైన చర్మం కోసం ప్యాకెట్ పాలు ఏమాత్రం ఉపయోగపడవు. ఇవి పాయిశ్చరైజేషన్ ప్రకియ తర్వాతే మార్కెట్లోకి వస్తాయి. కనుక ఆవు, లేదా గేదెల నుంచి నేరుగా తెచ్చుకునే పచ్చి పాలను మాత్రమే ముఖానికి అప్లై చేయండి.
ఇంకో ముఖ్యమైన విషయం..
పాలు అందరికీ పడవు. కనుక మీరు పచ్చి పాలను ముఖానికి అప్ల్లై చేసుకోవడానికి ముందు.. చర్మానికి కొంచెం అప్లై చేసుకుని చూడండి. మంట, దురద లాంటివి రాకపోతేనే ముఖానికి అప్లై చేసుకోండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మే తొలివారంలో మళ్లీ వర్షాలు..!