పని ఒత్తిడి, ఇతర ఆందోళలను తగ్గించడానికి 9 సరళమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ఈ చిట్కాలు మీ మసస్సు, శరీరాన్ని విశ్రాంతి తీసుకునేందుకు సహాయపడతాయి. కష్ట సమయాల్లో మిమ్మల్ని దృఢంగా ఉంచుతాయి.  

pexels

By Bandaru Satyaprasad
May 10, 2025

Hindustan Times
Telugu

 శరీరాన్ని స్ట్రెచ్ చేయండి - కొన్ని నిమిషాల పాటు మీ కాళ్లు, చేతులు, నడుమును స్ట్రెచ్ చేయండి. ఇది శారీరక టెన్షన్ ను తగ్గించి, శరీరాన్ని రీసెట్ చేస్తుంది. ప్రత్యేకించే మీరు గంటల తరబడి కూర్చొని ఉంటే మధ్య మధ్యలో శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ ఉండండి.  

pexels

10 నిమిషాల ధ్యానం - నిశ్శబ్దంగా కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మీ మనస్సును శాంతింపజేయడానికి, ఆందోళన తగ్గించడానికి సహాయపడుతుంది.  

pexels

మంచి ఆహారాలు - ఒత్తిడిని తగ్గించే ఆహారాలు ఎంపిక చేసుకోండి. బ్లూబెర్రీస్, సిట్రస్ పండ్లు, డార్క్ చాక్లెట్ , గుడ్లు, సాల్మన్ లేదా పెరుగును మీ భోజనంలో చేర్చుకోండి. ఇవి ఆరోగ్యకరమైనవి, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.  

pexels

డీప్ బ్రీత్ - 4 సెకన్ల పాటు లోతుగా గాలి పీల్చుకోండి. 4 సెకన్ల పాటు శ్వాస కంట్రోల్ చేసి...4 సెకన్ల పాటు గాలిని విడిచిపెట్టండి. ఇది మీ శరీరానికి విశ్రాంతి ఇచ్చేందుకు ఒక సంకేతాన్ని పంపుతుంది. మీ గుండె స్పందన రేటును తగ్గిస్తుంది.  

pexels

స్క్రీన్ సమయాన్ని తగ్గించండి - ప్రతికూల సమయాల్లో స్క్రీన్ స్క్రోలింగ్ తగ్గించండి. స్క్రీన్ సమయాన్ని తగ్గించి మీ మెదడు నిరంతర పని నుంచి విరామం ఇవ్వండి.  

pexels

ప్రియమైన వారితో సమయం గడపండి - మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండండి. ఒక చిన్న ఫోన్ కాల్ లేదా కలిసి భోజనం చేయడం మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.  

pexels

సంగీతం వినండి - మానసిక ఆందోళనను తగ్గించడానికి సంగీతం శక్తివంతమైన మార్గం. మీ దృష్టిని మార్చడానికి, ఆలోచనను తేలికపరచడానికి మీకు ఇష్టమైన ప్లేలిస్ట్ లేదా సున్నితమైన మ్యూజిక్ ప్లే చేయండి.  

pexels

సువాసన గల కొవ్వొత్తులను ఉపయోగించండి- సువాసన గల కొవ్వుత్తులను ఇంట్లో వెలిగించడం వల్ల ప్రశాంతత భావం కలుగుతుంది. ఇది మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.  

pexels

శని దోషం తొలగిపోవాలంటే చేయాల్సిన పనులు ఇవే!