అరటి తొక్కే కదా అని పారేయకండి. ఈ అరటి తొక్కల నీటితో జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది.

pexels

By Hari Prasad S
Jan 30, 2025

Hindustan Times
Telugu

అరటిలో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు కుదుళ్ల ఆరోగ్యానికి మంచిది. జుట్టును స్మూత్‌గా చేస్తాయి. మరి ఈ అరటి తొక్కల నీటిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి

pexels

కొన్ని అరటి తొక్కలకు ఓ గ్లాసు నీటిని చేర్చి తక్కువ మంటపై పది, పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.

pexels

ఆ తర్వాత నీటిలో నుంచి అరటి తొక్కలను తొలగించి గది ఉష్ణోగ్రత దగ్గర చల్లార్చాలి

pexels

ఆ నీటిని జుట్టుపై స్ప్రే చేయాలి. తర్వాత మెల్లగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత దానిని అలాగే 20 నుంచి 30 నిమిషాలు వదిలేయాలి

pexels

అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. షాంపూ, కండిషనర్ కూడా వాడొచ్చు

pexels

ఈ అరటి తొక్కల నీటిని వారానికి రెండుసార్లు జుట్టుకు రాసి, మసాజ్ చేస్తూ ఉంటే ఫలితం ఉంటుంది

pexels

ఇక నుంచి అరటి తొక్కలను పారేయకుండా సింపుల్‌గా ఈ నీటిని తయారు చేసి జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించుకోండి

pexels

కార్తీక దీపం 2 సీరియ‌ల్‌లో దీప‌గా బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది ప్రేమి విశ్వ‌నాథ్‌. 

Instagram