ప్రస్తుతం చాలా మంది ఊబకాయం (అధిక బరువు) సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఊబకాయం తగ్గేందుకు కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఇవే.
Photo: Pexels
పసుపులో చాలా ఔషద గుణాలు ఉంటాయి. ఫ్యాట్‍ను కరిగించే లక్షణం కూడా పసుపులో ఉంటుంది. అందుకే పసుపును పాలల్లో, నీళ్లలో కలుపుకొని టీలా తాగడం, ఆహారాల్లో వాడడం చేస్తే బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
Photo: Pexels
త్రిఫల చూర్ణం కూడా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ నీటిని మరిగించి.. దాంట్లో ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణం వేయాలి. సగం గ్లాస్ అయ్యే వరకు ఆ నీటిని మరిగించాలి. ఆ తర్వాత తగినంత తేనె వేసుకొని తాగాలి.
Photo: Pexels
ఊబకాయం తగ్గాలంటే సరైన నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీరు తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
Photo: Pexels
ఆయుర్వేదం ప్రకారం, రాత్రిపూట భోజనం సూర్యాస్తమయానికి ముందే చేస్తే చాలా మేలు. అంటే సాయంత్రం 7 గంటలకే భోజనం చేయాలి. ఆ తర్వాత ఏమీ తినకూడదు. రాత్రి ఆలస్యంగా తింటే ఊబకాయం సమస్య పెరుగుతుంది.
Photo: Pexels
ఆహారంలో కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది. వీటి వల్ల శరీరానికి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కారం ఎక్కువగా ఆహారాలు, ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ లాంటి అనారోగ్యకరమైన ఆహారాలు తినకూడదు.
Photo: Pexels
చలికాలంలో జలుబు, వైరల్ ఫ్లూ సర్వసాధారణంగా వస్తుంటాయి. జలుబు, ఫ్లూ, సీజనల్ మార్పులు కారణంగా శీతాకాలంలో గొంతు సమస్యలు వస్తుంటాయి.