దంతాలు ఆరోగ్యంగా ఉంటే నోటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. నోటి దుర్వాసన, దంతక్షయాన్ని నివారించడానికి వీలైనంత వరకు కొన్నింటికి దూరంగా ఉండాలి.

Unsplash

By Anand Sai
Nov 20, 2023

Hindustan Times
Telugu

మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ కొన్నిసార్లు మనం తినే ఆహారం మన శరీర ఆరోగ్యంతోపాటుగా నోటిని, దంతాలను కూడా పాడు చేస్తుంది.

Unsplash

ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే ముందుగా దాన్ని వదులుకోండి. ఆల్కహాల్ మీ దంతాలు, చిగుళ్ళతో త్వరగా సమస్యలను అభివృద్ధి చేస్తుంది. మీ నోటిలో ఇన్ఫెక్షన్ కూడా సృష్టించవచ్చు.

Unsplash

ఎక్కువగా బ్రెడ్ కూడా తినొద్దు. ఇది నోటిలో అంటుకుంటుంది. తీపి పదార్థాలు మీ దంతాలలో కావిటీని కలిగిస్తాయి.

Unsplash

సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి మంచిదే. కానీ అతిగా తీసుకోవద్దు. ఎక్కువ ఆమ్లం దంతాల ఉపరితల ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. దంత క్షయాన్ని కలిగిస్తుంది. 

Unsplash

శీతల పానీయాలు తరచుగా తీసుకోవడం వల్ల మీ దంతాలు, చిగుళ్ళు దెబ్బతింటాయి. ఆమ్ల స్థాయిలు దంతాల పైన ఉండే ఎనామిల్‌ను నాశనం చేస్తాయి.

Unsplash

బంగాళదుంప చిప్స్ కూడా మీ దంత ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బంగాళాదుంప చిప్స్‌లో స్టార్చ్ ఉంటుంది, ఇది నోటిలో చెడు బ్యాక్టీరియాను ఫీడ్ చేస్తుంది. 

Unsplash

చెడు ఆహారపు అలవాట్ల వల్ల చాలా మందికి నోటి క్యాన్సర్ వస్తుంది. చాలా వేడి ఆహారాలు తినడం తప్పు. అంతే కాకుండా నోటి ఆరోగ్యానికి పనికిరాని కొన్ని ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండటం మంచిది.

Unsplash

కాలేయానికి మేలు చేసే 5 రకాల ఆహారాలు ఇవి

Photo: Pexels