అద్భుత ఔషధ గుణాల గని అవెనా సతైవా...

By Sarath Chandra.B
Mar 24, 2025

Hindustan Times
Telugu

కష్టపడి పనిచేసే  ప్రతి ఒక్కరికి అవెనా సతైవాతో శక్తి సమకూరుతుంది...

అవెనా సతైవాలో ఔషధ గుణాలు మెండుగా ఉండటం వల్ల నిద్రలేమి, నరాల బలహీనత, అలసట,లైంగిక వాంఛల్లో లోపం వంటి సమస్యల నుంచి  బయట పడొచ్చు. 

నిరంతరం మానసిక ఒత్తిడికి గురయ్యే వారిలో మెదడు, గుండె వాటి శక్తిని కోల్పోయి నాడీ వ్యవస్థ దెబ్బతిని మానసిక రుగ్మతలకు, గుండె జబ్బులకు దారి తీస్తుంది. 

గుండె పనితీరును సరి చేయడంలో అవెనా సతైవా అద్భుతంా పనిచేస్తుంది. 

స్త్రీ పురుషుల్లో లైంగిక శక్తి వారిలో టెస్టోస్టెరాన్‌ హర్మోనుపై ఆధారపడి ఉంటుంది. 

టెస్టోస్టెరాన్‌ హర్మోన్‌ 20వ ఏట నుంచి క్రమంగా  తగ్గుతుంది. 40ఏళ్లు దాటిన వారిలో  అది 50శాతానికి తగ్గిపోతుంది,.

స్త్రీ పురుషులిద్దరిలో లైంగిక  శక్తి తగ్గిపోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతాయి. 

టెస్టోస్టెరాన్‌ హార్మోను పనితీరును మెరుగు పరచడానికి  అవెనా సతైవా, అశ్వగంధ, డామియానా టింక్చర్స్‌ అద్భుతంగా పని చేస్తాయి. 

మత్తు పదార్ధాలు, సిగరెట్లు అలవాటు ఉన్న వారిలో అవెనా సతైవా టింక్చర్ రోజుకు మూడు సార్లు 15 చుక్కల చొప్పున  తీసుకుంటే  వాటి మీద ఆసక్తి తగ్గుతుంది. 

వ్యాధులతో నీరసించిపోయిన వారికి అవెనా సతైవా ద్వారా త్వరగా శక్తి సమకూరుతుంది. 

వయసు మళ్లిన వారిలో రక్త ప్రసరణ తగ్గి కాళ్లు చేతులు వణకడం, అవయవాలు మొద్దుబారడం జరుగుతుంది. వారికి చక్కటి టానిక్‌గా పని చేస్తుంది. నిద్రించే ముందు అవెనా సతైవా టింక్చర్‌ 20 చుక్కల చొప్పున నీటిలో కలిపి సేవిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. 

సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త