ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 విజేతలకు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ వస్తుందో తెలుసా?

By Sanjiv Kumar
Jan 12, 2025

Hindustan Times
Telugu

ఈరోజు (జనవరి 12) నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌లోని ప్రధాన మ్యాచ్‌లు ప్రారంభమవుతున్నాయి.

స్టార్ టెన్నిస్ ఆటగాళ్ళు ప్రతిష్టాత్మక టైటిల్ గెలవడానికి పోటీ పడుతున్నారు.

జనవరి 25న మహిళల ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అలాగే, 26న పురుషుల విభాగంలో ఛాంపియన్ ఎవరో తెలుస్తుంది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి ఛాంపియన్ అయ్యే ఆటగాళ్లకు భారీ నగదు బహుమతి లభిస్తుంది.

ఫైనల్‌లో గెలిచిన ఆటగాడికి ఏకంగా 35 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు బహుమతిగా లభిస్తుంది. రూపాయిల విలువలో చెప్పాలంటే దాదాపు 18.52 కోట్లు.

రన్నరప్‌గా నిలిచినవారికి 19 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు నగదు బహుమతి లభిస్తుంది. అంటే 10.05 కోట్ల రూపాయలు.

సెమీఫైనలిస్టులకు 11 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (5.82 కోట్ల రూ.), క్వార్టర్ ఫైనలిస్టులకు 6.65 లక్షల డాలర్లు (3.51 కోట్ల రూ.) బహుమతి లభిస్తుంది.

నాల్గవ రౌండ్‌కు చేరుకున్న ఆటగాళ్లు 4.20 లక్షల డాలర్ల బహుమతిని పొందుతారు, మూడవ రౌండ్‌కు చేరుకున్నవారు 2.90 లక్షల డాలర్ల నగదు బహుమతిని పొందుతారు.

ఆవనూనెతో జుట్టుకు 5 అమేజింగ్ బెనిఫిట్స్!