ఇంగ్లండ్ ‘యాషెస్’ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు

Photo Credit: Reuters

By Chatakonda Krishna Prakash
Jul 23, 2023

Hindustan Times
Telugu

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్‍లో భాగంగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది.

Photo Credit: Reuters

వర్షం వల్ల నాలుగో టెస్టు ఐదో రోజు (జూలై 23) ఆట మొత్తం తుడిచి పెట్టుకుపోయింది.

Photo Credit: AP

నాలుగో టెస్టు ఆసాంతం ఇంగ్లండ్ ఆధిపత్యం ప్రదర్శించినా.. వర్షం వల్ల చివరికి మ్యాచ్‍ డ్రాగా ముగిసింది.

Photo Credit: AP

ఈ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 317 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ అద్భుతంగా ఆడి 592 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ ఆధిక్యాన్ని సాధించింది.

Photo Credit: PTI

అయితే, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో.. వరుణుడు రంగ ప్రవేశం చేశాడు.

Photo Credit: AP

నాలుగో టెస్టు ఐదో రోజు ఆట జరగకపోవటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో గెలుస్తామనుకున్న ఇంగ్లండ్ నిరాశకు గురైంది.

Photo Credit: Reuters

ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‍లో ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ గెలిచి సిరీస్‍ను సమం చేసి యాషెస్ గెలుపు ఆశలను సజీవంగా ఉంచుకోవాలన్న ఇంగ్లండ్ ఆశ నెరవేరలేదు. 

Photo Credit: Reuters

కనీసం సిరీస్‍ను సమం చేసుకోవాలంటే జూలై 27 నుంచి జరిగే ఐదో టెస్టును ఇంగ్లండ్ తప్పక గెలవాల్సిందే. 

Photo Credit: Reuters

వానలో అలా.. అలా- వర్షాకాలంలో ట్రిప్​? ఇవి మిస్​ అవ్వకండి.

pixabay