వర్షాకాలంలో ఉష్ణోగ్రతలో మార్పులు అనేక సమస్యలను కలిగిస్తాయి. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
Unsplash
By Anand Sai Jul 24, 2024
Hindustan Times Telugu
ఆస్తమా రోగులు ఈ సీజన్‌లో వారి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి, జాగ్రత్తగా ఉండాలి.
Unsplash
ధూళి, పొగ, వాయు కాలుష్యం, ధూమపానం వంటి అనేక కారణాల వల్ల ఆస్తమా సంభవించవచ్చు.
Unsplash
వర్షాకాలంలో తేమ పెరుగుతుంది, ఫంగస్ వృద్ధి అవకాశాలను పెంచుతుంది. ఫంగస్ ఆస్తమాను తీవ్రతరం చేస్తుంది. శ్వాస సమస్యలను కలిగిస్తుంది.
Unsplash
వర్షాకాలంలో చలి, తేమ కారణంగా, ఆస్తమాతో బాధపడుతున్న రోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. అటువంటి పరిస్థితిలో వారు తమ ఇన్‌హేలర్ ఎల్లప్పుడూ తమతో ఉంచుకోవాలి.
Unsplash
ఆస్తమా రోగులు జలుబు, దగ్గు సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఆస్తమా దాడి ప్రమాదాన్ని పెంచుతుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందండి.
Unsplash
ఇంటి లోపల ఉంచిన ఇండోర్ మొక్కలను వర్షాకాలంలో బయట ఉంచాలి. వీటి వల్ల ఆస్తమా రోగులు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. అంతేకాదు అనేక రకాల ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు.
Unsplash
ఆస్తమా రోగులు ఈ సీజన్‌లో వేడి నీటిని తాగాలి. అంతే కాకుండా ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం, పచ్చి కూరగాయలు తీసుకోవాలి.
Unsplash
పుచ్చకాయ చాలా పోషకాలు కలిగిన పండు. వేసవిలో శరీరానికి మేలు చేస్తుంది. ఇది నీటి శాతాన్ని కలిగి ఉంటుంది.