తెలుగు యాంకర్, బిగ్‍బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ హిమాచల్ ప్రదేశ్ వెకేషన్‍లో ఎంజాయ్ చేస్తున్నారు. హిల్‍స్టేషన్‍లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ వెకేషన్‍లో దిగిన ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ బ్యూటీ.
Photo: Instagram
స్లీవ్‍లెస్, ప్లంగింగ్ నెక్‍లైన్‍తో ఉన్న టైట్ ఫిట్ బ్లాక్‍టాప్ ధరించి అందాలు ఒలకబోశారు అరియానా. టాప్‍కు సూటయ్యేలా ప్యాంట్ ధరించారు. ఈ బ్లాక్ ఔట్‍ఫిట్‍లో గ్లామరస్‍గా మెరిశారు.
Photo: Instagram
కెమెరాలకు కిర్రాక్ పోజులు ఇచ్చారు అరియానా. డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్లు, హాట్ చూపులతో ఆకట్టుకున్నారు. ప్రకృతి అందాల మధ్య ఫొటోలతో అదరగొట్టారు.
Photo: Instagram
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు (ఏప్రిల్ 28) పోస్ట్ చేశారు అరియానా. కొన్నిసార్లు సింపుల్‍గా ఉండే విషయాలే చాలా అందంగా ఉంటాయంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు ఈ బ్యూటీ.
Photo: Instagram
యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టారు అరియనా గ్లోరీ. కొన్ని టీవీ షోలకు యాంకరింగ్ చేశారు. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‍గోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వ్యూతో ఈ బ్యూటీ చాలా పాపులర్ అయ్యారు.
Photo: Instagram
బిగ్‍బాస్ తెలుగు 4వ సీజన్‍లో కంటెస్టెంట్‍గా పాల్గొని ఫైనల్ వరకు వెళ్లారు అరియనా. దీంతో మరింత ఫేమస్ అయ్యారు. అనుభవించు రాజా, అద్భుతం, ఆ ఒక్కటి అడక్కు చిత్రాల్లోనూ కనిపించారు అరియానా. ప్రస్తుతం షణ్ముక సినిమాలోనూ ఓ పాత్ర చేస్తున్నారు ఈ బ్యూటీ.
Photo: Instagram
30ఏళ్ల వయసులో కెరీర్‌ను ఎలా మలుచుకోవాలి? ఈ వయసులో వచ్చే అత్యంత ముఖ్యమైన మార్పులు ఏమిటి?