చాలా మంది టూత్ బ్రష్‌లను ఎక్కువ కాలం వాడుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. అనేక రకాల నోటి సమస్యలు వస్తాయి.

Unsplash

By Anand Sai
Dec 30, 2024

Hindustan Times
Telugu

బ్రష్ పూర్తిగా పాడయ్యేదాకా వాడటం మంచిది కాదు. దీని వల్ల పళ్లు సరిగ్గా తోముకోలేరు. ప్రతి 2 నుండి 3 నెలలకు మీ టూత్ బ్రష్‌ను మార్చాలని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది.

Unsplash

బ్రష్ వాడేందుకు తెరిచి మూడు నెలలకు పైగా ఉపయోగించినట్లయితే దానిని మళ్లీ ఉపయోగించకూడదు.

Unsplash

ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే పళ్ళు తోముకున్నం కదా అని దాచిపెట్టి వాడొద్దు. మూడు నెలలకు పైగా వాడే బ్రష్‌లు దంతాలను సరిగా శుభ్రం చేయవు.

Unsplash

పాత బ్రష్‌లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది. అలాంటప్పుడు పళ్ళు తోముకోవడం వల్ల ప్రయోజనం ఉండదు.

Unsplash

పాత బ్రష్ దంతాల మీద మరకలను తొలగించదు. దంతాలను సరిగ్గా శుభ్రం చేయలేనందున నోటి దుర్వాసన వస్తుంది.

Unsplash

టూత్ బ్రష్‌లు, లాలాజలం, బ్యాక్టీరియా రక్తంలో కలిసిపోయి కలుషితాన్ని కలిగిస్తాయి. ఉపయోగించిన తర్వాత బ్రష్‌ను బాగా కడిగి ఆరబెట్టండి.

Unsplash

మీ బ్రష్‌లను ఇతరులు ఉపయోగించినట్లయితే వాటిని వెంటనే పడేయాలి. టూత్‌పేస్ట్‌ను పెట్టుకునే ముందు బ్రష్‌ను నీటిలో బాగా కడగాలి.

Unsplash

నోటి దుర్వాసన చాలా ఇబ్బంది పెడుతుంది. ఇతరులతో మాట్లాడటానికి కూడా సంకోచించాల్సి వస్తుంది.

pexels