మధ్యాహ్నం నిద్రమబ్బుగా అనిపిస్తోందా? ఇవి కారణమై ఉండొచ్చు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jun 25, 2024

Hindustan Times
Telugu

కొన్నిసార్లు మధ్యాహ్నం చాలా నిద్రమబ్బుగా అనిపిస్తోంది. తప్పక నిద్రపోవాలనిపిస్తుంది. మధ్యాహ్నం వేళ ఎక్కువ నిద్రమబ్బుగా అనిపించేందుకు కారణాలు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

మధ్యాహ్నం పూట అవసరానికి కంటే ఎక్కువ తింటే అది నిద్రమబ్బుకు కారణం అవుతుంది. ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల చురుకుదనం తగ్గి.. విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. రస్తప్రసరణ వేగం తగ్గుతుంది.  

Photo: Pexels

రాత్రివేళ సరిగా నిద్రపోకపోతే.. ఆ ప్రభావం మధ్యాహ్నం చూపిస్తుంది. రాత్రి కావాల్సినంత నిద్రపోకపోతే.. మధ్యాహ్నం వేళలో ఎక్కువ నిద్రమబ్బుగా ఉంటుంది. 

Photo: Pexels

కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల కూడా మధ్యాహ్నాల్లో నిద్ర ఫీలింగ్ ఉండేందుకు కారణం అవుతుంది. 

Photo: Pexels

ఒత్తిడి కారణంగా కూడా మధ్యాహ్నం నిద్రమబ్బుగా అనిపిస్తుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటే కూడా ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. 

Photo: Pexels

రోజులో ఎక్కువ శారీరక శ్రమ చేయడం వల్ల కూడా మధ్యాహ్నం నిద్రపోవాలని అనిపిస్తుంది. శరీరానికి అలసట ఎక్కువగా అయితే నిద్రమబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. 

Photo: Pexels

పీరియడ్స్​ సమయంలో ఏం తినాలి? ఏ ఆహారాలు తినకూడదు?

pixabay