ఎక్కువగా పొడిబారితే జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. డల్‍గా మారుతుంది. అందుకే వెంట్రుకలు హైడ్రేటెడ్‍గా ఉండేలా చూసుకోవాలి. జుట్టు ఎక్కువగా పొడిబారుతుంటే సమస్య తగ్గేందుకు ఈ టిప్స్ ఫాలో అవండి.
Photo: Pexels
జుట్టుకు ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె, ఆర్గోన్ ఆయిన్ లాంటివి వాడాలి. ఆ నూనెలు రాస్తే జుట్టులో తేమ పెరుగుతుంది. వెంట్రుకలు పొడిబారే సమస్య తగ్గుతుంది.
Photo: Pexels
జుట్టు పొడిబారే సమస్య ఉన్న వారు.. హెయిర్ డ్రెయర్స్ లాంటి హీటింగ్ ప్రొడక్టులు వాడకూడదు. తల స్నానం చేశాక టవల్‍తోనే సహజంగా జుట్టు తుడుచుకోవాలి.
Photo: Pexels
కోడిగుడ్డు పచ్చసొనలో విటమిన్-ఏ, ఈ, లెసిథిన్ ఉంటాయి. అందుకే సొనలో కాస్త తేనె కలుపుకొని జుట్టుకు మాస్క్ లా వేసుకోవాలి. దీంతో వెంట్రుకల్లో తేమ పెరుగుతుంది. దీన్ని వారానికి ఒకసారి జుట్టుకు అప్లై చేసుకుంటే మేలు.
Photo: Pexels
వెంట్రుకలకు ప్రతీ రోజు హెయిర్ సీరమ్ వాడండి. జుట్టులోని తేమను సీరమ్ కాపాడుతుంది. మీ జుట్టుకు రక్షణ కోటింగ్‍గానూ ఉంటుంది.
Photo: Pexels
అవకాడో, అరటి పండు కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసుకొని వాడాలి. అవకాడోల్లో అవసరమైన ప్రొటీన్లు, అమినో యాసిడ్స్, విటమిన్లు ఉంటాయి. దీని వల్ల వెంట్రుకల కుదుళ్లు బలంగా అవుతాయి. అరటిలో ఉండే ఫోలిక్ యాసిడ్, పొటాషియమ్ వల్ల జుట్టుకు పోషకాలు అందుతాయి.
Photo: Pexels
పొద్దుతిరుగుడు విత్తనాలలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా అనేక రకాల వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి.