బరువు తగ్గాలనుకునే వారు క్యారెట్లు రెగ్యులర్‌గా తినొచ్చా?
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Jan 01, 2025
Hindustan Times Telugu
బరువు తగ్గాలనుకునే వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పోషకాలు ఎక్కువగా.. క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ఈ క్రమంలో ఆహారం విషయంలో కొన్ని డౌట్స్ వస్తుంటాయి.
Photo: Pexels
క్యారెట్ తియ్యగా ఉండటంతో వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వారు వీటిని రెగ్యులర్‌గా తినొచ్చా లేదా అనే సందేహాలు ఉంటాయి. దీని సమాధానం ఇక్కడ చూడండి.
Photo: Pexels
బరువు తగ్గాలనుకునే వారు క్యారెట్లను డైలీ తినొచ్చు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్‍కు క్యారెట్ చాలా ఉపయోగపడుతుంది.
Photo: Pexels
క్యారెట్‍లో ఫైబర్ మెండుగా ఉంటుంది. దీంతో కడుపు నిండిన ఫీలింగ్‍ను ఇది ఎక్కువసేపు ఉంచుతుంది. దీంతో పదేపదే ఆహారం తీసుకోవాలనే ఆలోచన రాదు. ఆకలిని క్యారెట్ తగ్గిస్తుంది. అందుకే వెయిట్ లాస్ డైట్‍లో క్యారెట్ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.
Photo: Pexels
కాలేయం పనితీరును క్యారెట్ మెరుగుపరుస్తుంది. శరీరంలోని వ్యర్థాలు బయటికి పోయేందుకు సహకరిస్తుంది. ఇలా కూడా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
Photo: Pixabay
క్యారెట్లలో విటమిన్ ఏ, సీ, ఫోలెట్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లతో పాటు మరిన్ని పోషకాలు ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు రెగ్యులర్‌గా క్యారెట్ తినడం మేలు.
Photo: Pexels
గుండె, కళ్లు, చర్మం ఆరోగ్యానికి క్యారెట్లు మంచి చేస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి.
Photo: Pexels
కొంతమంది ఎక్కువసేపు ప్రయాణం చేసిన తర్వాత రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కొందరికి జీర్ణ సంబంధ సమస్యలు ఉండటం సర్వసాధారణం.