వేసవిలో ఈ 3 నూనెలు రాస్తే జుట్టు పొడవుగా పెరిగేస్తుంది
Photo: Unsplash
By Haritha Chappa Mar 26, 2025
Hindustan Times Telugu
వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల జుట్టులో అనేక సమస్యలు వస్తాయి. జుట్టు పొడిబారడం సహా అనేక ఇతర సమస్యలు ఉన్నాయి. కొంతమంది జుట్టు రాలడాన్ని ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు.
Photo: Pexels
వేసవిలో జుట్టు సమస్యలను తగ్గించడానికి నూనెను ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్ వేసవిలో జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.
Photo: Pexels
ఎండాకాలంలో జుట్టులో తేమ ఎండిపోతుంది. దీని వల్ల జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి తరచూ నూనె రాసుకోవాలి. ఈ నూనె జుట్టు తేమను కాపాడుతుంది.
Photo: Pexels
సూర్యుని అతినీలలోహిత (యువి) కిరణాలు జుట్టును దెబ్బతీస్తాయి. కొబ్బరి నూనె రాయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారకుండా, రాలిపోకుండా ఉంటుంది.
Photo: Pexels
వేసవిలో మాడు కూడా ఎండిపోతుంది. ఫలితంగా చుండ్రు పెరుగుతుంది. ఇక్కడ చెప్పి మూడు నూనెల్లో ఏదో ఒక దాన్ని అప్లై చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది.
Photo: Pexels
వేసవిలో కాలుష్యం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. కాబట్టి ఎప్పుటికప్పుడు తలకు స్నానం చేస్తూ దుమ్మూధూళిని తొలగించుకోవాలి.
Photo: Pexels
జుట్టుకు కొబ్బరి, ఆలివ్ వంటి నూనెలు రాయడం వల్ల జుట్టు రాలడం తగ్గి పొడవుగా పెరగడం మొదలవుతుంది.
Photo: Pexels
వేసవిలో జుట్టు వదులుగా ఉంచడం మంచి పద్దతి కాదు. లూజ్ గా అయినా జడ వేసుకోవడం ఉత్తమం.
Photo: Pexels
బాదం నూనె అప్పుడప్పుడు రాయడం వల్ల వేసవిలో జుట్టు పొడవుగా పెరుగుతుంది. ప్రయత్నించి చూడండి.
Photo: Pexels
తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మే తొలివారంలో మళ్లీ వర్షాలు..!