ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే కార్డుల్లో మార్పు చేర్పులు నమోదు చేస్తున్నారు. జూన్ నుంచి రేషన్ స్మార్ట్ కార్డులు జారీ చేస్తారు. 

pexels

By Bandaru Satyaprasad
May 07, 2025

Hindustan Times
Telugu

రేషన్ కార్డు దరఖాస్తు కోసం ఏం చేయాలి? ఏఏ పత్రాలు సమర్పించాలి. ఏ వివరాలు అప్లికేషన్ లో నమోదు చేయాలో తెలుసుకుందాం. 

pexels

కొత్త రేషన్ కార్డు దరఖాస్తు కోసం అప్లికేషన్ తో పాటు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు జిరాక్సులు సమర్పించాలి. కుటుంబ సభ్యులలో పెద్ద వయసు కలిగి మహిళను ఇంటి యజమానిగా నమోదు చేయాలి. రేషన్ కార్డు పొందడానికి కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించరాదు.  

pexels

రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం- కొత్తగా కుటుంబ సభ్యులను రేషన్ కార్డులో చేర్చేందుకు అప్లికేషన్ తో పాటు, సభ్యుల ఆధార్ కార్డు జిరాక్సులు, కొత్త చేర్చే వారి బర్త్ సర్టిఫికేట్ లేదా వివాహ ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల రేషన్ కార్డు వివరాలు, తల్లిదండ్రులు ఆధార్ కార్డు జిరాక్స్ లు, రైస్ కార్డు జిరాక్స్ కాపీ సమర్పించాలి.  

pexels

రైస్ కార్డు నుంచి కుటుంబ సభ్యులను తొలగించడానికి అప్లికేషన్ తో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జిరాక్సులు, మరణం కారణం సభ్యులను తొలగించాలనుకుంటే వారి డెత్ సర్టిఫికెట్(ఉంటే), రైస్ కార్డు జిరాక్స్ కాపీ సచివాలయాల్లో సబ్మిట్ చేయాలి.  

pexels

రైస్ కార్డులో సభ్యుల విభజన కోసం అప్లికేషన్ తో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జిరాక్సులు, వివాహ ధ్రువీకరణ పత్రం, పెళ్లి కార్డు, పెళ్లి వేడుక ఫొటో, రైస్ కార్డు జిరాక్స్ కాపీలు జతచేయాలి.  

pexels

రైస్ కార్డులో అడ్రస్ మార్పు కోసం - దరఖాస్తుదారుడి వ్యక్తి గత వివరాలు, మార్పు చేయాల్సిన అడ్రస్ వివరాలు, అప్లికేషన్ , దరఖాస్తు దారుడి ఆధార్ కార్డు కాపీ సచివాలయంలో సబ్మిట్ చేయాలి.  

pexels

రైస్ కార్డులో ఆధార్ సీడింగ్ కోసం - దరఖాస్తుదారుడి వ్యక్తి గత వివరాలు నింపిన అప్లికేషన్, సరిచేయాల్సిన ఆధార్ వివరాలు, సభ్యులు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ సచివాలయాల్లో దరఖాస్తు సమయంలో అందించాలి.  

pexels

 రైస్ కార్డు సరెండర్ చేసేందుకు - దరఖాస్తుదారుడి వివరాల నింపిన అప్లికేషన్ తో పాటు రైస్ కార్డు కాపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో సబ్మిట్ చేయాలి. 

pexels

విటమిన్ లోపాలను గుర్తించండి 

ఈ సమస్యలు విటమిన్ లోపాల వల్లనే వస్తాయని మీకు తెలుసా?

PEXELS, RUSH