అద్భుతమైన బీచ్ లకు ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరు. శ్రీకాకుళం మొదలు నెల్లూరు వరకు సుందరమైన బీచ్ లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.  

HT Telugu

By Bandaru Satyaprasad
Feb 02, 2025

Hindustan Times
Telugu

బంగాళాఖాతం సముద్ర జలాలు ఆంధ్ర ప్రాంతాన్ని ముద్దాడుతున్నట్లు ఎంతో సుందరంగా ఉంటుంది. ఒక వైపున తూర్పు కనుమలు, మరోవైపు సముద్రపు తరంగాలతో ఆంధ్రప్రదేశ్ బీచ్ లు ఎంతో అద్భుతంగా ఉంటాయి.  

HT Telugu

బారువా బీచ్ - శ్రీకాకుళం నుంచి మీ ప్రయాణం మొదలుపెడితే... ముందుగా బారువా బీచ్ చూడాల్సిందే. శ్రీకాకుళం పట్టణం నుంచి 108 కి.మీ దూరంలో ఈ బీచ్ ఉంటుంది. భారతదేశ రెండో గోవాగా దీనిని పిలుస్తారు.  

AP Tourism

యారాడ బీచ్ - విశాఖపట్నం నుంచి 25 కి.మీ దూరంలో ఉంటుంది. ఇది గంగవరం పోర్టు, డాల్ఫిన్స్ నోస్ సమీపంలో ఉంటుంది. ఈ బీచ్ కు ప్రకృతి ప్రేమికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.  

AP Tourism

ఆర్కే బీచ్ - విశాఖ నగరంలో అద్భుతమైన బీచ్. ఐ.ఎన్.ఎస్. కుర్సురా సబ్ మెరైన్, ఇతర పర్యాటక ఆకర్షణలు ఈ బీచ్ లో ఉంటాయి. విశాఖ వాసులు సాయంత్రం వేళల్లో ఆర్కే బీచ్ లో సేదతీరుతారు.  

AP Tourim

రుషికొండ బీచ్ - విశాఖ నగరానికి అతి సమీపంలో(13 కి.మీ) ఉంటుంది. ఈ బీచ్ ను 'జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్' అని కూడా పిలుస్తారు. ఈతకొట్టడం, వాటర్ స్కీయింగ్, విండ్ సర్ఫింగ్, పారా గ్లైడింగ్ ఆటలకు అనువైన ప్రదేశం. ఇది బ్లూ ఫ్లాగ్ బీచ్.  

AP Tourism

కళింగపట్నం బీచ్- ఇది శ్రీకాకుళం నుంచి 28 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ వంశధార నది బంగాళాఖాతంలో కలుస్తుంది. సముద్ర తీరంలో ముగుస్తున్న రహదారి కారణంగా ఈ బీచ్‌ను ఓపెన్ రోడ్ సీ అని పిలుస్తారు.  

AP Tourism

భీమిలి బీచ్ - విశాఖపట్నం నుంచి 30 కి.మీ దూరంలోని భీమిలి ప్రాంతంలో ఉంది. భీమిలి బీచ్ లో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది.  

AP Tourism

 కాకినాడ, అంతర్వేది, పేరుపాలెం, సూర్యలంక, ఓడరేవు, రామయపట్నం, మైపాడు బీచ్ లు ఆంధ్ర తీరంలో అద్భుతమైన ప్రకృతి సహాజ అందాలకు నెలవు.  

AP Tourism

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels