మెదడులోని జ్ఞాపకాలను గుర్తించడం, గుర్తు చేసుకోవడం ద్వారా చేతనావస్థలోకి వస్తాయి
మెదడు పనితీరులో లోపాల వల్ల మతిమరుపు సమస్యలు తలెత్తుతాయి
దీర్ఘకాలిక మద్యపానం, జీర్ణకోశ వ్యాధులు, మెదడు క్యాన్సర్, గాయాలు, పోషకాహార లోపం, విషప్రభావం, పక్షవాతం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోవచ్చు
ఖచ్చితమైన వైద్య పరీక్షల ద్వారా మతిమరుపు కారణాలను గుర్తించాలి
జ్ఞాపకశక్తి కోల్పోవడంలో ప్రధానంగా షార్ట్ టర్మ్ మెమోరీ లాస్, లాంగ్ టర్మ్ మెమోరీ లాస్ ఉంటాయి
వ్యాధి మొదలు కావడానికి ముందు విషయాలు మర్చిపోతే రిట్రోగ్రేడ్ అమ్నేషియా, ముందు జరిగిన విషయాలు గుర్తుండి తర్వాత విషయాలు మరిస్తే యాంటీగ్రేడ్ అమ్నేషియాగా పరిగణిస్తారు
జ్ఞాపకశక్తిని పెంచే ఔషధాలపై ఇప్పటి వరకు శాస్త్రీయ నిర్ధారణలు లేవు, మనిషికి అవసరమైన విషయాల వరకు మాత్రమే గుర్తించుకునే సామర్థ్యం మెదడుకు ఉంటుంది. అనవసరమైన విషయాలను దానంతట అదే తొలగిస్తుంది.
పిల్లలకు ఈ ఆహారాలు ఇస్తే.. మెదడు షార్ప్ అవుతుంది!