ఉసిరిని ఆరోగ్యసిరిగా చెప్పొచ్చు. ఉసిరి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

Pixabay

By Hari Prasad S
Nov 28, 2023

Hindustan Times
Telugu

ఉసిరి జలుబు, డయాబెటిస్, జుట్టు సంరక్షణ, కొలెస్ట్రాల్ నియంత్రణలాంటి వాటన్నింటికీ ఓ మ్యాజిక్ మాత్రలా పని చేస్తుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు

Pixabay

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరిని ఆరోగ్య ప్రదాయినిగా చాలా మంది చెబుతుంటారు

Pixabay

ఉసిరిలో అధిక మొత్తంలో ఉండే ఫైటోకెమికల్స్ కాలేయంలోని విష పదార్థాలను తొలగించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది

Pixabay

డయాబెటిస్‌ ఉన్న పేషెంట్లలో గ్లూకోజ్ జీవక్రియను ఉసిరి మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

Pixabay

ఉసిరి నుంచి తీసిన ద్రవాలు జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా ఉండేలా చేస్తుంది

Pixabay

ఉసిరి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే పీపీఏఆర్-ఎ అనే ప్రొటీన్ స్థాయిలను పెంచుతుంది

Pixabay

సాధారణంగా వచ్చే జలుబు, దగ్గులాంటి వాటికి కూడా ఉసిరి మంచి ఔషధంలా పని చేస్తుంది

Pixabay

అవిసె గింజలను వేయించుకొని తినొచ్చా? లాభాలు ఏంటి

Photo: Pexels