మానవ జీర్ణ వ్యవస్థ గురించి మీకు ఈ విషయాలు తెలుసా...
By Sarath Chandra.B May 21, 2025
Hindustan Times Telugu
నోటి నుంచి మల ద్వారం వరకు ఉండే పొడవైన నాళ అమరికను జీర్ణవ్యవస్థ అంటారు. ఇది దాదాపు 9మీటర్ల పొడవు ఉంటుంది.
నోరు, గొంతు, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, మలాశయం, మలద్వారం వరుసగా 30మీటర్ల పొడవు ఉంటాయి.
నోట్లోకి తీసుకున్న ఆహారాన్ని లాలాజలంతో కలిపి నమలడం వల్ల అది చిన్నచిన్న ముక్కలుగా మారుతుంది. లాలాజలం ఆహారంలోని పిండి పదార్ధాలను అణవులుగా విడగొడుతుంది.
బాగా నమలకుండా ఆహారాన్ని మింగితే జీర్ణ వ్యవస్థలోని ఎంజైములు సక్రమంగా పనిచేయవు.
జీర్ణశయానికి సంకోచించి, వ్యాకోచించే గుణాలు ఉంటాయి. జీర్ణాశయం లోపలి వైపు గోడ ముడతలుగా ఉండి వాటిపై మ్యూకస్ పొర ఉంటుంది.
జీర్ణ వ్యవస్థలో జరిగే సంకోచ, వ్యాకోచాలతో ఆహారం పైకి, కిందకు కదిలి గ్రైండర్‌లో పిండి రుబ్బినట్టు మెత్తగా మారుతుంది.
జీర్ణాశయం లోపలి పొరలు మెత్తగా మారిన ఆహారం నుంచి ఖనిజాలు, లవణాలు, విటమిన్లను సంగ్రహిస్తాయి.
జీర్ణాశయంలో తయారయ్యమే పెప్సిన్ అనే ఎంజైమ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సాయంతో ఆహారంలోని మాంస కృతులను చిన్న అణువులుగా విడగొడుతుంది.
పిండి పదార్ధాలు, మాంసకృతులు, క్రొవ్వులు వంటి పదార్ధాలురసాయిన చర్యల ద్వారా చిన్న చిన్న పదార్ధాలుగా మారతాయి.
మనకు ఆకలి కావడానికి, ఆహారం జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్నీ, ఎంజైములను తయారు చేయడానికి జీర్ణాశయంలో దాదాపు మూడు కోట్లకు పైగా సూక్ష్మ గ్రంథులు ఉంటాయి.
నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు