న్యుమోనియా నుంచి వేగంగా కోలుకునేందుకు ఉపయోగపడే అద్భుత ఆహారాలు..
Pixabay
By Sharath Chitturi Nov 27, 2023
Hindustan Times Telugu
న్యుమోనియా సోకకుండా ఉండేందుకు, ఒక వేళ సోకితే.. వేగంగా రికవరీ అయ్యేందుకు కొన్ని ఆహారాలు ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు.
Pixabay
న్యుమోనియా రోగులు కచ్చితంగా తేనెను తీసుకోవాలి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి తీవ్రతను ఇది తగ్గిస్తుంది. నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగితే బెటర్!
Pixabay
న్యుమోనియా తొలి దశలో ఛాతి నొప్పి వస్తుంది. యాంటీ- ఇన్ఫ్లమేటర్ ప్రభావం చూపించే పసుపుతో నొప్పిని తగ్గించుకోవచ్చు.
Pixabay
పెరుగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి న్యుమోనియాకు కారణమైన బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా చేస్తాయి.
Pixabay
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. నట్స్, బీన్స్ వంటివి తినాలి.
Instagram
పాలకూర వంటి ఆకుకూరలు కచ్చితంగా తినాలి. ఇవి ఊపిరితిత్తుల్లో సమస్యను తగ్గిస్తాయి.
Pixabay
విటమిన్ సీతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. న్యుమోనియా వ్యాధి తగ్గుతుంది. సిట్రస్ పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది.
Pixabay
చిన్న పిల్లలు తరచూ నోటిలో చేతివేళ్లు పెట్టుకుంటారు. ముఖ్యంగా బొటనవేలు చప్పరించడం పిల్లలలో ఒక సాధారణ అలవాటు. కొంత సమయం తర్వాత ఈ అలవాటును మాన్పించడానికి మీ పిల్లలకు సహాయం అవసరం.