శరీరానికి వెంటనే శక్తిని ఇచ్చే అద్భుతమైన ఆహారాలు..

Pixabay

By Sharath Chitturi
Oct 01, 2023

Hindustan Times
Telugu

శరీరానికి వెంటనే శక్తి కావాలంటే అరటి పండ్లు బెస్ట్​! అరటి పండ్లలో పొటాషియం, ఫైబర్​, విటమిన్​ బీ-6 పుష్కలంగా లభిస్తాయి. అందుకే జిమ్​కి వెళ్లేవాళ్లు ఎక్కువగా తీసుకుంటారు.

Pixabay

చిలకడ దుంపలో ఫైబర్​, కాంప్లెక్స్​ కార్బోహైడ్రేట్స్​ ఎక్కువగా ఉంటాయి. ఇన్​స్టెంట్​ ఎనర్జీకే కాదు.. దీర్ఘకాల శక్తిని పొందేందుకు కూడా చిలకడ దుంపలు ఉపయోగపడతాయి.

Pixabay

డైట్​లో కచ్చితంగా యాపిల్​ ఉండాలి! దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. శరీరానికి వెంటనే శక్తిని కూడా ఇస్తాయి.

Pixabay

పాలకూరతో పోషకాలతో పాటు శక్తిని శక్తిని కూడా పొందొచ్చు. ఇందులో ఐరన్​ ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. పాలకూర ఎక్కువ తీసుకుంటే రక్త కణాలు వృద్ధిచెందుతాయి.

Pixabay

బాదం అనేది పోషకాలకు నిలయం! రోజూ బాదం తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్​ ఎక్కువగా ఉండటంతో ఎనర్జీ లెవల్స్​ పెరుగుతాయి.

Pixabay

గుడ్లు చాలా ఆరోగ్యకరం. ఇందులో ప్రోటీన్​లు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే దీర్ఘకాలంలో శక్తిని పొందొచ్చు.

Pixabay

రోజూ డార్క్​ చాక్లెట్​ తీసుకోవడం అంత మంచిది కాదు! కాకపోతే డార్క్​ చాక్లెట్​లతో ఇన్​స్టెంట్​ ఎనర్జీ లభిస్తుంది. ఇందులోని కోకోతో రక్త ప్రవాహం మెరుగుపడుతుంది.

Pixabay

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels