వేసవి కాలంలో శరీరం చల్లగా ఉండాలంటే కచ్చితంగా తినాల్సిన ఆహారాలు..

pixabay

By Sharath Chitturi
Feb 18, 2024

Hindustan Times
Telugu

వేసవి కాలం పేరు వింటేనే భయం మొదలవుతుంది. ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉంటాయి. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి.

pixabay

ఎప్పటికప్పుడు కొబ్బరి బొండం తాగాలి. శరీరం హైడ్రేటెడ్​గా ఉంటే.. మీ మీద వేసవి ప్రభావం పడదు!

pixabay

సిట్రస్​ పండ్లలో విటమిన్​ సీ పుష్కలంగా ఉంటుంది. మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వేసవి తాపాన్ని తట్టుకోగలుగుతారు.

pixabay

పెరుగుతో మీ శరీరం చల్లబడుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

pixabay

పాలకూర వంటి ఆకుకూరలను తరచూ తీసుకోవాలి. అన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.

pixabay

సమ్మర్​లో చికెన్​, రెడ్​ మీట్​కి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. వాటి స్థానంలో ఫిష్​ తీసుకోవచ్చని చెబుతున్నారు.

pixabay

సోడా, జంక్​ ఫుడ్​, శరీరానికి వేడి చేసే ఆహారాలకు దూరంగా ఉంటే.. వేసవి ప్రభావం మీ మీద పడదు.

pixabay

చర్మానికి మేలు చేసే కొలాజెన్‍ను పెంచగల 5 వెజిటేరియన్ ఆహారాలు

Photo: Pexels