తేనె కేవలం తీపి ఆహారం మాత్రమే కాదు, చలికాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే అద్భుత ఔషధం కూడా. 

Unsplash

By Anand Sai
Jan 03, 2024

Hindustan Times
Telugu

శీతలమైన వాతావరణంలో తేనె అనేది గొంతు దురదకు చికిత్సగా పని చేస్తుంది. మంట, చికాకును తగ్గిస్తుంది. తడి, పొడి దగ్గు రెండింటికీ సహాయపడుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి.

Unsplash

రోజూ తేనెను కొద్ది మెుత్తంలో తీసుకుంటే అలసట రాదు. టోస్ట్‌లో, టీలో వేసుకుంటే రోజంతా మీకు శక్తిని అందిస్తుంది.

Unsplash

నాణ్యమైన నిద్ర విలువైనది. పడుకునే ముందు తేనెతో ఒక వెచ్చని గ్లాసు పాలు తీసుకుండి. ఇది ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది.

Unsplash

తేనె గాలి నుండి తేమను ఆకర్షిస్తుంది, చర్మానికి బంధిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు పొడి, వృద్ధాప్య చర్మానికి దోహదపడే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.

Unsplash

తేనె, అలోవెరా కలిపి ముఖానికి రాసుకుంటే.. మాయిశ్చరైజింగ్ మాస్క్ లాగా పని చేస్తుంది.

Unsplash

తేనెను చర్మంపై ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి. కొంతమంది చర్మానికి తేనె పడదు.

Unsplash

ఆయుర్వేదంలోనూ తేనెకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శతాబ్దాలుగా ఉపయోగిస్తారు. రోజూ కొద్ది మెుత్తంలో తేనె తినడం మంచిది.

Unsplash

చలికాలంలో జలుబు నుంచి ఉపశమనం కలిగించే టీ ఇది

Photo: Pexels