ఉసిరి మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోగల సూపర్ ఫుడ్. నిపుణులు ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగాలని సిఫార్సు చేస్తున్నారు. చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.

Unsplash

By Anand Sai
Sep 19, 2023

Hindustan Times
Telugu

ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఉదయాన్నే ఉసిరి రసం తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.

Unsplash

ఉసిరిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. శరీరంలో మంటను తగ్గించడంలో, దీర్ఘకాలిక లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.

Unsplash

ఉసిరి రసం గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడేస్తుంది. అజీర్ణం, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

Unsplash

ఉసిరికాయలో అవసరమైన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగితే జీవక్రియను పెంచుతుంది.

Unsplash

మధుమేహం ఉన్న వ్యక్తులు ఉసిరి రసం తాగొచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంతిస్తుంది.

Unsplash

ఉసిరి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని అధిక ఫైబర్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఉపయోగపడతాయి.

Unsplash

ఉసిరి రసం శరీరానికి డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.

Unsplash

నాగ‌చైత‌న్య సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న తండేల్ మూవీ ఘ‌నంగా ప్రారంభ‌మైంది. 

twitter