పుష్ప 2: ది రూల్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ బంపర్ బ్లాక్‍బస్టర్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.
Photo: X
పుష్ప 2 మూవీ రేపు (జనవరి 30) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో రిలీజైన 56 రోజులకు ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది.
Photo: X
పుష్ప 2 మూవీని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు నెట్‍ఫ్లిక్స్ వెల్లడించింది. హిందీ వెర్షన్ ఆలస్యం కానుంది.
Photo: X
పుష్ప 2 సినిమా రీలోడెడ్ వెర్షన్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. రన్‍టైమ్ 3 గంటల 46 నిమిషాలుగా ఉండనుంది.
Photo: X
భారీ క్రేజ్ మధ్య గత నెల డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన పుష్ప 2 బంపర్ హిట్ కొట్టింది. ఈ సీక్వెల్ యాక్షన్ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించారు.
Photo: X
పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,850 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ క్రమంలో చాలా రికార్డులను ఈ చిత్రం క్రియేట్ చేసింది.
Photo: X
పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్‍కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, జగదీశ్ కీలకపాత్రలు చేశారు.
Photo: X
పుష్ప 2 చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍లో సామ్ సీఎస్ కూడా పాలుపంచుకున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడ్యూజ్ చేసింది.
Photo: X
రాత్రిపూట మటన్ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు రావొచ్చు!