దేశంలో ఎక్కువ మంది గుండెను కొల్లగొట్టిన మగధీరులు వీరంతా. మనదేశంలోని అమ్మాయిలు మనసులు కొల్లగొట్టారు. అందుకే వీరిని నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటారు.
తాహా షా: హీరామండిలో నటించిన నటుడు ఈయన. తన లుక్స్ తో ఎంతో మంది అమ్మాయిలకు నచ్చాడు.
రోహిత్ సరాఫ్: డియర్ జిందగీ సినిమాతో నటుడిగా మారాడు. మిస్ మ్యాచ్డ్, హిచ్కీ, ది స్కై ఈజ్ పింక్ వంటి సినిమాల్లో నటించాడు.
ఇబ్రహీం పటౌడీ: సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం. ప్యూమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఇన్‌స్టాగ్రామ్ లో అడుగుపెట్టాడు.
ఆదిత్య రాయ్ కపూర్: రొమాంటిక్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. ఆషికి2 సినిమాతో హిట్ కొట్టాడు. ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో నటించాడు.
సిద్ధాంత్ చతుర్వేది: గల్లీ బాయ్ గా ఎక్కువమందికి పరిచయం సిద్ధాంత్. గెహ్రాయాన్, ఖో గయే హమ్ కహాన్ వంటి సినిమాల్లో నటించాడు. ఇతని బాడీకి ఎంతో మంది అమ్మాయిలు ఫిదా అయిపోయారు.
షాహిద్ కపూర్: బాలీవుడ్ ప్రముఖ హీరో. జబ్ వి మెట్, హైదర్, ఫర్జీ వంటి అనేక సినిమాల్లో నటించాడు. ఇతనికి ఎక్కువగా అమ్మాయిలే ఫ్యాన్స్.
హృతిక్ రోషన్: బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్. 2000లో సినిమాల్లోకి ప్రవేశించాడు. ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్నాడు.
గుప్పెడంత మనసు సీరియల్ రక్షా గౌడకు తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టింది.