ఏఐ టెక్నాలజీని కొందరు తమ కెరీర్ గ్రోత్ కు ఉపయోగించుకుంటే...సైబర్ కేటుగాళ్లు అమాయకులను మోసం చేయడానికి వాడుతున్నారు.
unsplash
By Bandaru Satyaprasad Jul 18, 2023
Hindustan Times Telugu
ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీని సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్నారు. ఏఐతో ముఖం ముర్చుకుని తెలిసిన వాళ్లు కాల్ చేసినట్లు చేసి డబ్బులు అడుగుతున్నారు.
unsplash
ఏఐ టెక్నాలజీతో ఫేస్ మార్చుకుని ఓ సైబర్ నేరగాడు కేరళలోని ఓ వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
pixabay
కేరళలోని కోజికోడ్ కు చెందిన రాధాకృష్ణన్ కు ఓ నంబర్ నుంచి వాట్సప్ వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్ లో మాట్లాడుతున్న వ్యక్తి ఏపీలో ఉంటున్న తన స్నేహితుడిని పోలి ఉన్నట్లు ఉంది.
రాధాకృష్ణన్ కు తెలిసిన పేర్లు చెప్పాడు సైబర్ నేరగాడు. దీంతో అతడు తన స్నేహితుడేనని రాధాకృష్ణన్ భావించాడు.
pixabay
ఆ వీడియో కాల్ చేసిన వ్యక్తి తాను దుబాయ్ లో ఉన్నానని చెప్పి తన బంధువుల చికిత్స కోసం డబ్బులు కావాలని ఇండియా తిరిగి రాగానే ఇచ్చేస్తానని చెప్పాడు.
pixabay
బంధువుల చికిత్స కోసం రూ.40 వేలు ఇవ్వాలని కోరాడు సైబర్ నేరగాడు. దీంతో స్నేహితుడని భావించిన రాధాకృష్ణన్ ఆ సొమ్ము పంపించాడు.
pixabay
మళ్లీ కొన్ని రోజులకు కాల్ చేసి రూ.35 వేలు అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన రాధాకృష్ణన్ తన స్నేహితుడిని సంప్రదించాడు. ఇది సైబర్ నేరగాడు పని అని తెలుసుకున్న రాధాకృష్ణన్ ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
HT Telugu
కేరళ పోలీసుల సైబర్ ఆపరేషన్ విభాగం విచారించి ఆ వీడియో కాల్ చేసిన మోసగాడిని గుర్తించి మొత్తం సొమ్మును రికవరీ చేశారు
pixabay
జంక్ ఫుడ్ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?