మహా కుంభమేళాలోని త్రివేణి సంగమంలో ప్రముఖ నటుడు మిలింద్ సోమన్ తన భార్య అంకితా కోన్వర్‌తో కలిసి పవిత్ర స్నానం చేశారు. 

By Sanjiv Kumar
Jan 30, 2025

Hindustan Times
Telugu

ఒకప్పుడు సూపర్ మోడల్, నటుడు, క్రీడాకారుడు అయిన మిలింద్ సోమన్ ఈ పుణ్యస్నానంలో తన భార్య అంకితా కోన్వర్‌తో తో కలిసి ఉన్నారు.

మిలింద్ పసుపు రంగు దుస్తులు ధరించి మెడలో రుద్రాక్ష మాలతో కనిపించారు. అతని భార్య అంకిత సాధారణ కుర్తా ధరించి పుణ్యస్నానం చేశారు.

పుణ్యస్నానంకు సంబంధించిన వివిధ క్షణాలను మిలింద్ సోమన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

 "మౌని అమావాస్య వంటి పవిత్ర రోజున అంకితతో మహా కుంభమేళాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక ప్రదేశానికి వచ్చి, ఈ అనంతమైన దేవుని ముందు నా ఉనికి చాలా చిన్నదిగా అనిపిస్తోంది" అని మిలింద్ రాసుకొచ్చారు.

మహాకుంభంలో జరిగిన ప్రమాదం గురించి 'ఈ లోకంలో మనం ఉన్న సమయం చాలా విలువైనది. నా మనసు నిండిపోయినప్పటికీ, గత రాత్రి సంఘటన నన్ను బాధించింది. ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపం తెలియజేస్తున్నాను. హర హర గంగే, హర హర మహాదేవ!' అని మిలింద్ రాశారు.

59 ఏళ్ల వయసులో, మిలింద్‌కు ఈ వయసు కేవలం సంఖ్య మాత్రమే అనిపిస్తుంది. జుట్టు, గడ్డంలో గ్రే హెయిర్ కనిపించినప్పటికీ ముఖంలో వృద్ధాప్యం ఛాయలు ఎక్కడ కనిపించవు. 

బలమైన శరీరం, ఆరోగ్యకరమైన జీవనశైలితో 59 ఏళ్ల ఈ సూపర్ మోడల్, నటుడు, క్రీడాకారుడు తరచుగా వార్తల్లో నిలుస్తాడు.

మరాఠీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మిలింద్ స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జన్మించాడు. కానీ, ఎనిమిది సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో కలిసి ఇక్కడికి వచ్చాడు.

ఇక తనకంటే 26 ఏళ్ల చిన్నదైన అంకితా కోన్వర్‌ను వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నాడు ఈ మాజీ సూపర్ మోడల్.

కాగా మిలింద్ సోమన్ భార్య అంకిత కోన్వర్‌ వయసు ప్రస్తుతం 33 ఏళ్లు. ఇద్దరి మధ్య 26 ఏళ్ల తేడా ఉంటుంది.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ఆరు వంద‌ల ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న‌ది.