ఏసీల నిర్వహణ సరిగ్గా లేకపోతే మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక్కోసారి పూర్తిగా పనిచేయడం మానేస్తాయి. కంపెనీ సిఫార్సు మేరకు మీ ఎయిర్ కండీషనర్ క్రమం తప్పకుండా నిర్వహణ, క్లీనింగ్ చేయించడం చాలా ముఖ్యం. అయితే ఎప్పుడు, ఎలా సర్వీసింగ్ చేయించాలో తెలుసుకుందాం.   

pexels

By Bandaru Satyaprasad
Apr 28, 2024

Hindustan Times
Telugu

మీరు ఏసీని ఎక్కువగా ఉపయోగిస్తుంటే...దాని సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. అదనపు ఖర్చుతో పాటు విద్యుత్ బిల్లు ఎక్కువ అవుతుంది. అందుకే ఏసీలను సరైన సమయాల్లో క్లీనింగ్, సర్వీసింగ్ చేయించుకోవాలి.   

pexels

కనీసం ఏడాదికి ఒకసారి లేదా వేసవి కాలం ప్రారంభానికి ముందు ఏసీలను సర్వీసింగ్ చేయించాలని కంపెనీలు సూచిస్తున్నాయి. ఏడాదికి ఒక్కసారి అయినా ఏసీ సర్వీసింగ్ చేయించాలి.  

pexels

ఏసీ సర్వీసింగ్ మీరు వాడుతున్న AC బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ఏసీ సర్వీసింగ్ కోసం వివిధ పద్ధతులు ఉంటాయి. సాధారణ, లోతైన శుభ్రత అనే రెండు విధాలుగా ఏసీలను క్లీన్ చేస్తారు. 

pexels

సాధారణ ఏసీ సర్వీసింగ్ -ఈ విధానంలో టెక్నీషియన్.. ఏసీ నుంచి స్వచ్ఛమైన గాలి వచ్చేందుకు ఫిల్టర్లను శుభ్రపరుస్తారు. ఏసీ అంతరాయం లేకుండా పనిచేయడానికి ఏడాదికి ఒకసారి నార్మల్ సర్వీసింగ్ చేయించాలని కంపెనీలు సలహా ఇస్తాయి. 

pexels

డీప్ క్లీనింగ్- ఈ సర్వీసింగ్ లో ఇండోర్ కూలింగ్ కాయిల్స్, బ్లేడ్‌లు, బ్లోవర్ వీల్స్‌తో పాటు ఫిల్టర్ క్లీనింగ్‌, ఏసీ జెట్ పంప్‌, ఇండోర్ కూలర్ డ్రెయిన్ ట్రే క్లీనింగ్‌ చేస్తారు. టెక్నీషియన్ పేపుల గ్యాస్ లీక్‌లు, కాయిల్స్‌ను తనిఖీ చేస్తాడు. 

pexels

క్రమం తప్పకుండా ఏసీ సర్వీసింగ్ చేయకపోతే కూలింగ్ తగ్గిపోవడం, విద్యుత్ బిల్లు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.  ఏసీని సరైన విధంగా నిర్వహిస్తే విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవచ్చు. ఏసీ సర్వీసింగ్ చేయడంతో విద్యుత్ వినియోగాన్ని 5–15 శాతం తగ్గిస్తుంది.   

pexels

మీరు సొంతంగా ఎయిర్ ఫిల్టర్‌ను కడగడం, అవుట్‌డోర్ యూనిట్ బ్లేడ్‌లను శుభ్రపరచడం వంటి ప్రాథమిక సర్వీసింగ్ చేయవచ్చు. కానీ టెక్నీషియన్ సర్వీసులను వినియోగించడమే మేలని కంపెనీలు సిఫార్సు చేస్తున్నాయి. సొంతంగా సర్వీసింగ్ చేస్తే ACలోని కొన్ని భాగాలను దెబ్బతినే అవకాశం ఉంది.  

pexels

హీట్ సమ్మర్‌లో కూల్‌గా ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

Instagram