విరాట్ కోహ్లీ, రోహిత్, గిల్ రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ

By Sanjiv Kumar
Feb 03, 2025

Hindustan Times
Telugu

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన టాప్ 5 టీమిండియా బ్యాటర్స్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం. 

1. అభిషేక్ శర్మ 2025లో ముంబైలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 135 పరుగులు చేశాడు.

2. 2023లో అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అజేయంగా 126 పరుగులు చేశాడు.

2023లో గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ అజేయంగా 123 పరుగులు చేశాడు.

4. 2022లో దుబాయ్‌లో అఫ్గానిస్థాన్‌లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అజేయంగా 122 పరుగులు చేశాడు.

5. 2024లో బెంగళూరులో అఫ్గానిస్థాన్త్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ అజేయంగా 121 పరుగులు చేశాడు.

ఆదివారం (ఫిబ్రవరి 2) ముంబైలో జరిగిన మ్యాచ్‌లో టాప్ 1గా ఉన్న శుభ్‌మన్ గిల్ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు. అలాగే, గిల్ తర్వాత ఉన్న రుతురాజ్, విరాట్, రోహిత్ శర్మ రికార్డ్స్ కూడా బ్రేక్ చేశాడు అభిషేక్.

ఎగ్జామ్స్ రోజుల్లో మంచి, నాణ్యమైన నిద్రకు ఈ చిట్కాలు పాటించాలంటున్న సర్రే విశ్వవిద్యాలయం

Photo Credit: Unsplash