శరీరంలో కొన్ని చోట్ల చర్మం సహజమైన రంగుని కోల్పోయి, చర్మం రంగు తెల్లగా మారిపోతుంది.చర్మం సహజమైన రంగును కోల్పోవడం జబ్బు కాదు. వయసు పెరిగే కొద్దీ  జట్టు నెరిసినట్టే చర్మం రంగు కూడా కొందరిలో మారుతుంది. 

By Bolleddu Sarath Chandra
Dec 05, 2024

Hindustan Times
Telugu

చర్మం రంగు తెల్లగా మారిపోవడాన్ని తెల్లపొడ, బొల్లి, విటిలిగో అని కూడా అంటారు. వైద్య పరిభాషలో ల్యూకో డెర్మాగా పరిగణిస్తారు. 

చర్మం మీద నల్లమచ్చలు ఏర్పడితే దానిని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు.

చర్మం మద ఏర్పడే మచ్చలు తెల్ల రంగులో ఉంటే దానిని హైపో లిగ్మేంటేషన్ అంటారు

చర్మం రంగు చర్మంలోని మెలనిన్‌ అనే పిగ్మెంట్‌ ఆధారంగా ఉంటుంది.  మెలనిన్‌ ఎక్కువగా ఉన్న భాగాలు నల్లగా, తక్కువగా ఉన్న భాగాలు నల్లగా కనిపిస్తాయి.

భూ మధ్య రేఖకు దగ్గరగా ఉన్న వారిలో సూర్యరశ్మిని తట్టుకునేలా మెలనిన్‌ ఎక్కవగా ఉండి నలుపు రంగులో ఉంటారు. 

బొల్లి చర్మ సంబంధిత సమస్యే తప్ప అంటు వ్యాధి కాదు. దీని వల్ల ప్రాణాపాయం ఏమి ఉండదు.  కేవలం సౌందర్య పరమైన సమస్యగానే పరిగణించాలి.

బొల్లి సమస్యను అధిగమించేందుకు ఆధునిక చికిత్సలు అనేకం అందుబాటులో ఉన్నాయి. అల్ట్రా వయోలెట్‌, మెలనిన్‌ పూతలతో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

బొల్లిలో మచ్చలు చేతుల మీద, ముఖం మీద, శరీరంపై ఎక్కడైనా రావొచ్చు. కొందరికి శరీరంలో ఒక చోటే తెల్లపొడ కనిపిస్తుంది. 

కొందరిలో శరీరంలో కొన్ని భాగాల్లో  మాత్రమే తెల్ల మచ్చలు రావొచ్చు. పురుషులలో పురుషాంగం, స్త్రీలలో మర్మావయవాల దగ్గర మచ్చలు రావొచ్చు. 

శరీరంలో ఏదో ఒక ప్రదేశానికి పరిమితం అయ్యే మచ్చలో 20ఏళ్లలోపు వయసులోేనే ఏర్పడతాయి

శరీరంలో కొన్ని భాగాలకు మాత్రమే పరిమితం అయ్యే మచ్చలు ఇతర భాగాలకు వ్యాపించవు. 

బొల్లి రావడానికి స్పష్టమైన కారణాలు అంటూ ఏమి లేవు. శరీరంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గితే చర్మం రంగులో మార్పులు వస్తాయి. రక్తహీనత, షుగర్, థైరాయిడ్‌ సమస్యలు ఉన్నవారిలో, జింక్ లోపం ఏర్పడినా  బొల్లి రావొచ్చు. 

పక్షవాతం వచ్చే ముందు శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి?

Image Source From unsplash