దాల్చిన చెక్క అతి పురాతన కాలం నుంచి ఆరోగ్యాన్ని చేకూర్చేదిగా ఆహార పదార్ధాల తయారీలో వినియోగిస్తున్నారు.
By Bolleddu Sarath Chandra Nov 29, 2024
Hindustan Times Telugu
దాల్చిన చెక్కను పానీయాల్లో వినియోగించడం పురాతన కాలం నుంచి వినియోగంలో ఉంది.
మధుమేహ నియంత్రణలో దాల్చిన చెక్క మంచి పనితీరు ప్రదర్శిస్తుంది. దాల్చన చెక్క పొడితో చేసిన పానీయాలను సేవించడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది.
దాల్చిన చెక్కకు జీర్ణశక్తిని పెంచడంలో అంటు వ్యాధులు అరికట్టడంలో, రక్త ప్రసరణ సరిగా జరిగేందుకు, కీళ్ల నొప్పుల నివారణలో ఔషధంగా వినియోగిస్తారు.
దాల్చిన చెక్కలో దాదాపు 200రకాలు ఉన్నాయి. శ్రీలంక, ఇండియా, బ్రెజిల్, మడగాస్కర్, కరీబియన్ దీవుల్లో సిన్నమోమమ్ జెలాండికమ్‌గా పరిగణిస్తారు.
మొక్కలలో సహజంగా లభించే ఫైటో కెమికల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఫైటో కెమికల్స్ దాల్చన చెక్కలో పుష్కలంగా లభిస్తాయి.
పరగడుపున దాల్చిన చెక్కతో చేసిన పానీయం సేవిస్తే షుగర్ అదుపులో ఉంటుంది. మధుమేహంలో తలెత్తే ఇతర అనారోగ్య సంబంధాలకు కూడా ఈ ఔషధం పనిచేస్తుంది.
దాల్చిన చెక్కలో బెంజాల్ డిహైడ్, బెటా కెరోటిన్, కాంఫర్, సినమార్టిహైడ్, యూగెనాల్, టానిన్, టెల్పినోలిన్ వంటివి ఉంటాయి.
దాల్చిన చెక్కలో కాల్షియం, క్రోమియం, కాపర్, అయోడిన్, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, జింక్ , పలు రకాల విటమిన్లు అబిస్తాయి.
దాల్చిన చెక్కలో శరీరంలో ఉష్ణాన్ని కలిగించే స్వభావం ఉంటుంది. దీనిని వింటర్ సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు.
జీర్ణశక్తికిి దాల్చిన చెక్క గొప్ప సహాయకారిగా పనిచేస్తుంది. ఆకలి మందగించినపుడు డైజిస్టివ్ టానిక్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే కేటిచిన్స్ వికారాన్ని తొలగించడానికి ఉపయోగపడతాయి.
కడుపులో ఉబ్బరంగా ఉన్నపుడు దాల్చిన చెక్క కడుపులో గ్యాస్‌ను బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది.
కీళ్ల నొప్పులను తొలగించడంలో దాల్చిన చెక్క మంచి ఔషధంగా పని చేస్తుంది.
శరీరంలో అనేక వ్యాదులకు కారణమైన ఈస్ట్‌ను నియంత్రించి బాక్టీరియా ఫంగస్ తొలగించడంలో కీలకంగా పనిచేస్తుంది.
వయసు మళ్లిన వారు, వ్యాధులు బారిన పడిన వారిలో రక్త ప్రసరణ సమస్యను దాల్చిన చెక్క పరిష్కరిస్తుంది.
స్త్రీల గర్భకోశంలో ఏర్పడే రక్తస్రావాన్ని అరికట్టడంలో దాల్చిన చెక్క చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.
దాల్చిన చెక్క రక్తాన్ని పలచన చేసి గుండెకు వెళ్లే రక్త ప్రసరణ సరళం చేయడంలో సహకరిస్తుంది.
దాల్చిన చెక్కలో ఉండే ఔషధ గుణాలు జీవకణాల మెటబాలిజం 20రెట్లు పెంచుతుంది. షుగర్ వ్యాధిలో సంభవించే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తొలగిస్తుంది. షుగర్ పేషెంట్లలో చక్కెర, ట్రైగ్లైసరైడ్లను, బ్యాడ్ కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గిస్తుంది. పరగడుపున దాల్చిన చెక్కరసం తాగితే ఫలితం ఉంటుంది.
సాధారణంగా చలికాలంలో చలి అనిపించడం సహజమే. కానీ మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ల కంటే మరీ ఎక్కువగా చలి అనిపిస్తోందా?