మటన్ వండే ముందు అల్లం తురుము వేయాలి. అల్లంలో ఉండే ఎంజైమ్‌లు మాంసాన్ని మెత్తగా చేస్తాయి.
Image Source From unsplash
చక్కెర లేని టీని వడకట్టి దాన్ని మటన్ మీద పోసి కొంతసేపు ఉంచాలి. టీలో ఉండే టానిన్లు మటన్ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి, దీంతో మటన్ త్వరగా మెత్తగా అవుతుంది.
Image Source From unsplash
మటన్ వండేటప్పుడు కొద్దిగా వెనిగర్ లేదా నిమ్మరసం వేయాలి. వీటిలో ఉండే ఆమ్లాలు మటన్‌ను మెత్తగా చేయడంలో సహాయపడతాయి.
Image Source From unsplash
పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలుగా చేయాలి. చిన్న ముక్కలు అయితే త్వరగా ఉడికిపోతాయి.
Image Source From unsplash
మందపాటి అడుగు ఉన్న పాత్రలో మటన్ వండడం వల్ల.. వేడి సమానంగా అన్ని చోట్ల పంపిణీ అవుతుంది. దీంతో మటన్ సరిగా ఉడుకుతుంది.
Image Source From unsplash
మూత బిగుతుగా వేయడం వల్ల నీరు ఆవిరి అయ్యి వెళ్లకుండా ఉంటుంది. ఇలాచేస్తే.. తొందరగా ఉడుకుంది.
Image Source From unsplash
మటన్‌ను ప్రెషర్ కుక్కర్‌లో వేస్తే మంచింది. ప్రెషర్ కుక్కర్ లో ఉండే అధిక పీడనం వల్ల మటన్ త్వరగా ఉడికిపోతుంది.
Image Source From unsplash
మటన్‌లో ఎక్కువ నీరు వేస్తే.. ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. మటన్ కొద్దిగా నీటిలోనే ఉండేలా చూసుకోవాలి.
Image Source From unsplash
నాన్ వెజ్ ఫుడ్ ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలకు మూలం. పౌల్ట్రీ, చేపలు, లీన్ మీట్ వంటి వివిధ రకాల మాంసాహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకోవడం ముఖ్యం.