పిల్లి ఎదురొస్తే నిజంగా అపశకునమేనా.. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా?
Image Source From unsplash
By Basani Shiva Kumar Mar 15, 2025
Hindustan Times Telugu
పూర్వకాలంలో ప్రయాణాలు ఎద్దుల బండ్ల మీదో, గుర్రాల మీదో జరిగేవి. అడవి మార్గాల్లో వెళ్లేటప్పుడు పిల్లి జాతికి చెందిన జంతువులు ఎదురయ్యేవి. వాటిని చూసి ఎద్దులు, గుర్రాలు భయపడి ఆగిపోయేవి. ప్రయాణానికి ఆటంకం కలిగేది. అందుకే పిల్లి జాతికి చెందిన జంతువులు ఎదురైతే అపశకునం అని భావించడం మొదలైంది.
Image Source From unsplash
పిల్లిని దరిద్ర దేవతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక గ్రంథాలలో సంపదకు దేవత మహాలక్ష్మి అయితే.. పేదరికానికి, ఇబ్బందులకు దేవత అలక్ష్మి. అంటే దరిద్ర దేవత అని చెబుతారు. పిల్లి దరిద్రాన్ని, ఇబ్బందులను మోసుకొస్తుందని చాలా మంది నమ్ముతారు.
Image Source From unsplash
వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పిల్లిని రాహువుకు వాహనంగా చెబుతారు. రాహువు ప్రయాణం కారణంగా పిల్లి ఎదురు రావడం అశుభంగా, దురదృష్టకరంగా భావిస్తారు.
Image Source From unsplash
పిల్లులు నెగటివ్ ఎనర్జీని ఎక్కువగా గ్రహిస్తాయని చాలా మంది నమ్ముతారు. కాబట్టి పిల్లి ఎదురొస్తే నెగటివ్ ఎనర్జీ వస్తుందని, దానివల్ల చెడు జరుగుతుందని భావిస్తారు.
Image Source From unsplash
పిల్లి పదే పదే ఏడ్వడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుందని.. త్వరలో ఏదైనా చెడు జరుగుతుందని ఎక్కుమంది నమ్ముతారు.
Image Source From unsplash
పిల్లులు చీకటిలో కళ్లు మెరిపిస్తాయి. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. దీనివల్ల పిల్లిని చూస్తే భయం వేస్తుంది. ఆ భయం వల్ల అపశకునం అని భావిస్తారు.
Image Source From unsplash
ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు పిల్లి ఎదురు వస్తే అపశకునం అని భావిస్తారు. దీనివల్ల పనికి ఆటంకం కలుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు.
Image Source From unsplash
అయితే ఇవన్నీ నమ్మకాలు మాత్రమే. ఈ మూఢ నమ్మకాలకు శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఇందులో నిజం ఎంత అనేది ఎవరూ చెప్పలేదు.
Image Source From unsplash
జంక్ ఫుడ్ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?