బైక్ నడిపేవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.. 8 ముఖ్యమైన అంశాలు

Image Source From unsplash

By Basani Shiva Kumar
Mar 16, 2025

Hindustan Times
Telugu

ఎక్కువసేపు బైక్ నడపడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా స్పాండిలోసిస్ లేదా డిస్క్ సమస్యలు రావచ్చు. కొందరు బైక్ నడిపేటప్పుడు సరిగ్గా కూర్చోరు. వంగినట్టుగా, పక్కకు జరిగి కూర్చొని నడుపుతుంటారు. ఇలా చేయడం వల్ల వెన్నెముక పైభాగం, కింది భాగంలో కూడా నొప్పి మొదలవుతుంది.

Image Source From unsplash

గంటల తరబడి ఒకే పొజిషన్‌లో కూర్చోవడం వల్ల కండరాలు బిగుతుగా మారతాయి. ముఖ్యంగా మెడ కండరాలు, భుజం, కాలి కండరాలు టైట్‌గా మారిపోతాయి.

Image Source From unsplash

బైక్ నడుపుతున్నప్పుడు మోకాల్లు, భుజాలు చాలా సేపు ఒకే స్థితిలో ఉంటాయి. ఎక్కువసేపు ఆ పార్టులు సేమ్ పొజిషన్‌లో ఉంచడం వల్ల కీళ్ల నొప్పి, కండరాలు బలహీనంగా మారిపోతాయి.

Image Source From unsplash

అతి వేగంగా బైక్ నడపడం వల్ల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. నరాలు సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

Image Source From unsplash

తగిన విశ్రాంతి లేకుండా బైక్ నడపడం వల్ల మానసిక ఒత్తిడి కలుగుతుంది. ఈ ప్రభావంతో గుండె పనితీరు తగ్గిపోతుంది. ఈ ప్రభావంతో శ్వాసక్రియపై కూడా పడుతుంది. దీంతో ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

Image Source From unsplash

బైక్‌పై ఎక్కువ కూర్చోవడం వల్ల వెన్నెముక నుండి కాళ్ల వరకు ఉండే నరాలు దెబ్బతింటాయి. వాటిపై ఒత్తిడి వల్ల రక్త ప్రసరణ జరగదు. దీంతో స్కియా‌టిక్ నరాలపై ఒత్తిడి పెరగడం వల్ల నొప్పి కలుగుతుంది.  

Image Source From unsplash

కొందరు బైక్ నడిపేటప్పుడు సరిగ్గా కూర్చోరు. వంగినట్టుగా, పక్కకు జరిగి కూర్చొని నడుపుతుంటారు. ఇలా చేయడం వల్ల అప్పర్ బ్యాక్ (వెన్నెముక పైభాగం) ప్రాబ్లమ్స్ వస్తాయి. లోయర్ బ్యాక్ (వెన్నెముక)లో కూడా నొప్పి మొదలవుతుంది.

Image Source From unsplash

రోజువారీ ఎక్కువసేపు బైక్ నడపడం వల్ల వెన్నెముక నొప్పి, కండరాల బలహీనత వస్తాయి. వీటి వల్ల నడక కూడా మారిపోతుంది. నిటారుగా నడవడం కష్టంగా మారిపోతుంది. ఎక్కువ సేపు స్ట్రయిట్‌గా నిలబడలేని పరిస్థితి ఏర్పడవచ్చు.

Image Source From unsplash

గర్భిణులు బీన్స్ గింజలు తినవచ్చా.. ఉపయోగాలు ఏంటి? 8 అంశాలు

Image Source From unsplash