ఇంట్లోనే రుచికరమైన పాప్‌కార్న్ తయారు చేసుకోవచ్చు.. చాలా సింపుల్!

Image Source From unsplash

By Basani Shiva Kumar
Dec 30, 2024

Hindustan Times
Telugu

ఎల్లప్పుడూ తాజా గింజలు ఉపయోగించండి. వెన్న, నూనెను వాడవచ్చు.రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవచ్చు. కారం పొడి, పసుపు, గరం మసాలా వాడొచ్చు. 

Image Source From unsplash

మధ్యస్థ మంట మీద ఒక పాన్‌ను వేడి చేయాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. 

Image Source From unsplash

నూనె వేడెక్కిన తర్వాత పాప్‌కార్న్ గింజలు వేసి మూత పెట్టండి. గింజలు పాప్ కావడం మొదలైన తర్వాత పాన్‌ను కదిలిస్తూ ఉండండి.

Image Source From unsplash

పాప్ కావడం ఆగిన తర్వాత ఉప్పు, కారం పొడి వంటి మసాలాలు వేసి బాగా కలపండి. వెంటనే సర్వ్ చేయండి.

Image Source From unsplash

మసాలా పాప్‌కార్న్‌ను కారం పొడి, గరం మసాలా వంటి వాటిని వేసి తయారు చేయవచ్చు. స్వీట్ పాప్‌కార్న్‌ను చక్కెర, బటర్ వేసి తయారు చేయవచ్చు.

Image Source From unsplash

కారేమెల్ పాప్‌కార్న్‌ను.. కారేమెల్ సాస్‌తో కలిపి తయారు చేయవచ్చు. చీజ్ పాప్‌కార్న్‌ను చీజ్ పౌడర్ వేసి తయారు చేయవచ్చు.

Image Source From unsplash

పాప్ కార్న్ చేసేటప్పుడు పాన్‌ను బాగా కదిలిస్తూ ఉండాలి. అలా చేస్తే.. అన్ని గింజలు సమానంగా పాప్ అవుతాయి. మూతను తరచూ తీయవద్దు. గింజలు పాప్ కావడం ఆగిపోతుంది.

Image Source From unsplash

తక్కువ మొత్తంలో గింజలు వేయాలి. పాన్‌లో అన్ని గింజలు సరిపోయేంత స్థలం ఉండాలి. పాప్ కార్న్ వేడిగా ఉన్నప్పుడు రుచి ఎక్కువగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయాలి.

Image Source From unsplash

జామకాయతోనే కాదు జామ ఆకులతోనూ అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో ఈ ఆకులను మరిగించిన నీరు తాగితే ఉపయోగం ఉంటుంది.

Unsplash