వేసవికాలంలో కీరదోసను తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో 95 శాతం నీరు ఉంటుంది. వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి ఇది బాగా పని చేస్తుంది.
image credit to unsplash
వేసవిలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కీరదోసలో అధిక శాతం నీరు ఉండటం వల్ల ఈ సమస్య బారినపడకుండా ఉండొచ్చు.
image credit to unsplash
ఈ వేసవిలో ప్రతిరోజూ కీరదోస తీసుకోవటం వల్ల వడదెబ్బ బారిన పడకుండా ఉండొచ్చు. తీవ్రమైన ఎండ పరిస్థితుల్లోనూ కీరదోస శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.
image credit to unsplash
ఈ వేసవిలో కళ్లు మండటం లేదా అలిసిపోయినట్లుగా ఉంటాయి. కీర దోసకాయ ముక్కను 10-15 నిమిషాలు కళ్లపై ఉంచడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
image credit to unsplash
కీరదీసను తీసుకోవటం వల్ల జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. ఆహారంలో దోసకాయ ముక్కలను చేర్చుకోవటం వల్ల కడుపు చల్లగా ఉంటుంది. మలబద్ధకం సమస్య కూడా ఉండదు.
image credit to unsplash
కీరదోసకాయ రసం వాడటం వల్ల చర్మం యవ్వనంగా, మృదువుగా మారుతుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.
image credit to unsplash
కీరదోస రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును కూడా తగ్గించడంలో సహాయపడుతాయి.
image credit to unsplash
వృద్ధాప్యం జీవితంలో ఒక సహజ భాగం, కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేసి, మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి 10 యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.