వేసవిలో నీళ్లు ఎక్కువగానే తాగుతాం. అయితే ఆ తాగే నీళ్లలో కాస్త ఉప్పు వేసుకొని తాగారంటే ఈ ఏడు ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి

pexels

By Hari Prasad S
Mar 24, 2025

Hindustan Times
Telugu

నీళ్లలో ఉప్పు వేసుకొని తాగితే అది శరీరంలో తేమను ఎక్కువసేపు నిలిపి ఉంచుతుంది. దీంతో ఎక్కువ సమయంపాటు హైడ్రేట్ అయి ఉంటారు. వేసవిలో ఇది చాలా ముఖ్యం

pexels

ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎంతో అవసరమైన ఎలక్ట్రోలైట్. ఇది శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడుతుంది

pexels

నీళ్లలో ఉప్పు వేసుకొని తాగితే అది జీర్ణక్రియను శుద్ధి చేస్తుంది. మలబద్ధకం సమస్యను అధిగమించేలా చేస్తుంది

pexels

ఉప్పు నీళ్లలో శరీరంలో మలినాలను బయటకు పంపించే గుణాలు ఉంటాయి. కిడ్నీలను ప్రేరేపించి శరీరంలో ఎక్కువ స్థాయిలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపేలా చేస్తుంది

pexels

ఉప్పు నీళ్లు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల చర్మ మెరుస్తుంది. తాగడమే కాదు ఈ ఉప్పు నీళ్లను ముఖానికి రాసుకున్నా ఫలితం ఉంటుంది.

pexels

ఉప్పు నీళ్లను తాగితే ఇది పరోక్షంగా బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి తోడ్పడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది.

pexels

ఉప్పు నీళ్లు మీ శ్వాస నాళంలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగించడానికి సాయం చేస్తుంది. దీనివల్ల శ్వాస సమస్యలను అధిగమించవచ్చు

pexels

ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు చాలా మందికి నోటి ద్వారా గాలి పీల్చే అలవాటు ఉంటుంది.

Unsplash