రోజంతా చురుకుగా ఉండటానికి మీకు శక్తినిచ్చే 6 సూపర్ ఫుడ్స్ 

pixa bay

By Haritha Chappa
Mar 20, 2025

Hindustan Times
Telugu

రోజంతా శక్తి వంతంగా,  చురుగ్గా ఉండాలంటే ఇక్కడిచ్చిన సూపర్ ఫుడ్స్ తినాలి.

Pixabay

అరటిపండ్లలో పొటాషియం,  కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటాయి. ఇవి శీఘ్ర శక్తిని అందిస్తాయి, వీటిని ప్రీ వర్కవుట్ ఫుడ్ తీసుకోవచ్చు.

Pixabay

గ్రీన్ టీలో ఉండే ఎల్-థియనిన్ అలసటను తగ్గిస్తుందని, అప్రమత్తతను పెంచుతుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని,  వ్యాయామం చేసేటప్పుడు శక్తి స్థాయిలు అందిస్తుందని అంటారు.

Pixabay

తక్కువ ఇనుము స్థాయిలు అలసటకు కారణమవుతాయి. పాలకూరలో ఇనుము పుష్కలంగా ఉంటుంది., ఇది స్థిరమైన శక్తి కోసం మీ శరీరంలో ఆక్సిజన్ రవాణా చేయడానికి సహాయపడుతుంది.

Pixabay

చియా సీడ్స్ సూపర్ ఫుడ్ గానే చెప్పుకోవాలి.  ఈ చిన్న విత్తనాలు తినడం వల్ల రోజంతా స్థిరంగా శక్తి అందుతుంది. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి.

Pixabay

డార్క్ చాక్లెట్ చిన్న ముక్క రోజూ తింటే రక్త ప్రసరణను పెంచుతుంది.  యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది, అలసటను తగ్గిస్తుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది.

Pixabay

ఓట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి తిన్నాక క్రమంగా శక్తిని విడుదల చేస్తుంది. మీ రోజును వోట్మీల్ తో  ప్రారంభించండి!

Pixabay

ఇక్కడ చెప్పిన  ఫుడ్స్ ను ప్రతి రోజూ తినడం ఆరోగ్యకరం. 

Pixabay

తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మే తొలివారంలో మళ్లీ వర్షాలు..!

image credit to unsplash