PEXELS
PEXELS
PEXELS
మీరు ఎల్లప్పుడూ అలసిపోయినట్లుగా ఉంటారు. పూర్తి రాత్రి నిద్ర తర్వాత కూడా అలసటగానే ఉంటారు. అలసట శారీరకమైనది మాత్రమే కాదు. భావోద్వేగ పరమైనది కూడా. ఇది మానసిక ఓవర్లోడ్ నుండి వస్తుంది.
PEXELS
ఒకప్పుడు మీరు ఆస్వాదించిన అభిరుచులు, వ్యక్తులు, పనులు ఇప్పుడు అర్థరహితంగా, అనాసక్తిగా అనిపిస్తాయి. ఇది వైఫల్యం లేదా నిరాశ వల్ల ప్రారంభమైన సంకేతాలుగా భావించాలి.
ఏ పని పైనా ఫోకస్ పెట్టలేకపోవడం, మతిమరుపు ప్రారంభం కావడం వంటివి కూడా మానసిక అనారోగ్యానికి సంకేతాలే. ఇది ఆందోళన, బర్న్అవుట్ లేదా నిరాశ వల్ల కావచ్చు.
తరచూ అందరినీ విసుక్కోవడం, మూడ్ స్వింగ్స్, త్వరగా కోపం రావడం వంటివి కూడా మానసిక అనారోగ్య సంకేతాలే.
ఒంటరిగా ఉండాలని కోరుకోవడం, ఎవరినీ కలవాలని లేకపోవడం మీలో పెరుగుతున్న డిప్రెషన్ కు సంకేతాలని చెప్పవచ్చు.
అతి నిద్ర లేదా నిద్రలేమి కూడా మానసిక అనారోగ్య లక్షణమే. అలాగే, అతిగా తినడం, లేదా పూర్తిగా ఆకలి లేకుండా ఉండడం కూడా మీలోని మానసిక సంఘర్షణను తెలిపేవే.
Unsplash