గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. అందుకే పోషకాలు ఉండే ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. గుండె మెరుగ్గా ఉండేందుకు కొన్ని రకాల గింజలు (సీడ్స్) మీ ఆహారంలో రెగ్యులర్‌గా తప్పకతీసుకోవాలి. ఆ ఆరు సీడ్స్ ఏవంటే..
Photo: Pexels
నువ్వుల్లో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ఫిటెస్టెరోల్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో చెడు కొవ్వును ఈ గింజలు తగ్గించగలవు. ఇలా గుండె ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి.
Photo: Pexels
అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) తినడం వల్ల ఒమేగా-3 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె పనితీరును ఈ గింజలు మెరుగుపరచగలవు.
Photo: Pexels
పొద్దుతిరుగుడు విత్తనాల్లో మెగ్నిషియం, కాపర్, ప్రొటీన్, విటమిన్ ఈ ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా ఈ గింజలు చేయగలవు.
Photo: Pexels
మెంతుల్లో సోలబుల్ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అందుకే మెంతి గింజలను మీ డైట్‍లో తీసుకుంటే గుండెకు మంచి జరుగుతుంది.
Photo: Pexels
చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఎక్కువ. వీటి తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇలా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Photo: Pexels
గుమ్మడి గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నిషియం, జింక్ సహా ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపకరిస్తాయి.
Photo: Pexels
ఈ 6 చిట్కాలతో ఏ వయసులోనైనా జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుకోండి!