తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు కలిగి ఉండే 6 ఫుడ్స్ ఇవి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Mar 16, 2025
Hindustan Times Telugu
పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలంటే ఎక్కువగా ఖర్చు చేయాలని చాలా మంది అనుకుంటారు. అందుకే కొందరు పోషకాల గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే తక్కువ ధరతో దొరికే కొన్ని ఆహారాల్లోనూ పోషకాలు మెండుగా ఉంటాయి. అలాంటి ఆరు ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
కోడిగుడ్లలో ప్రోటీన్,విటమిన్ డీ, కాల్షియం, ఐరన్, మెగ్నిషియంతో పాటు కీలకమైన విటమిన్లు,మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. గుడ్ల ధర కూడా అందుబాటులో ఉంటుంది. రోజుకు రెండు గుడ్లు తీసుకోవడం మేలు.
Photo: Pexels
చిలగడదుంపల్లో విటమిన్, ఏ, బీ, సీ, పొటాషియం, ఫైబర్ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. ఇవి తింటే పూర్తిస్థాయి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.
Photo: Pexels
పాలకూర అందుబాటు ధరలో దొరికే సూపర్ ఫుడ్. పాలకూరలో విటమిన్ ఏ, సీ, కే, ఐరన్, కాల్షియం, మెగ్నిషియంతో పాటు మరిన్ని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది.
Photo: Pexels
అరటి పండులో కీలకమైన విటమిన్లతో పాటు పొటాషియం, ఫైబర్ పుష్కలం. అందుబాటు రేటులోనే దొరికే అరటి తినడం వల్ల ఆరోగ్యంతో పాటు శరీరానికి మంచి ఎనర్జీ దక్కుతుంది.
Photo: Pexels
వేరుశనగల్లో విటమిన్ ఈ, విటమిన్ బీ సహా ఐరన్, పొటాషియం, కాల్షియం సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. అందుబాటు ధరలో ఉండే వీటిని రెగ్యులర్‌గా ఆహారాల్లో తీసుకుంటే మంచిది. పప్పు, కాయధాన్యాల్లోనూ మంచి పోషకాలు ఉంటాయి.
Photo: Pexels
నారింజలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ సహా మరిన్ని విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అందుబాటు ధరలో ఉండే ఈ పండును తింటే ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.
Photo: Pexels
వర్షాకాలంలో ఉసిరికాయ జ్యూస్ తాగడం ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది? ఇక్కడ తెలుసుకోండి