డార్క్ సర్కిల్స్ (కళ్ల కింద నల్లటి వలయాలు) సమస్య చాలా మందిలో ఉంటుంది. వీటిని తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ డార్క్ సర్కిల్స్ తగ్గేందుకు కొన్ని ఆహారాలు తోడ్పడతాయి. అవేవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
టమాటాల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సీ, కే కూడా ఎక్కువగా ఉంటాయి. కళ్లు కింద రక్తప్రసరణ మెరుగయ్యేలా టమాటా చేయగలదు. దీంతో డార్క్ సర్కిల్స్ తగ్గేందుకు సహకరిస్తుంది.
Photo: Pexels
కీరదోసలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కే, ఏ,ఈ, సీ కూడా ఉంటాయి. శరీరంలో కొలాజెన్ ఉత్పత్పిని కీరదోస పెంచుతుంది. తద్వారా డార్క్ సర్కిల్స్ సహా చర్మ సమస్యలు తగ్గేందుకు తోడ్పడుతుంది.
Photo: Pexels
బ్లూబెర్రీల్లో ఒమేగా 3, విటమిన్ కే,సీ, మ్యాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే, కళ్లు కింద రక్తప్రసరణను మెరుగుపరిచి.. డార్క్ సర్కిల్స్ తగ్గేలా బ్లూబెర్రీలు తినడం సహకరిస్తుంది.
Photo: Pexels
బీట్‍రూట్‍లో బీటైన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటుంది. డార్క్ సర్కిల్స్ ప్రభావం తగ్గేలా ఇది చేయగలదు.
Photo: Pexels
నారింజ పండులో విటమిన్ సీ, ఏ అధికంగా ఉంటుంది. కొలాజెన్ ఉత్పత్తిని పెంచి.. డార్క్ సర్కిల్స్ తగ్గడంలో ఈ పండు సాయం చేస్తుంది.
Photo: Pexels
బాదం, వేరుశనగలు, పాలకూర, బ్రకోలీ లాంటి వాటిల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ర్యాడికల్స్‌తో విటమిన్ ఈ పోరాడుతుంది. డార్క్ సర్కిల్స్ తగ్గేందుకు తోడ్పడుతుంది.