హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉండే 6 రకాల ఫుడ్స్.. తప్పకతినాలి!
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Feb 10, 2025
Hindustan Times Telugu
ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు హెల్దీ ఫ్యాట్స్ ఉండే ఆహారాలు తీసుకోవడం తప్పనిసరి. దీనివల్ల గుండె ఆరోగ్యం సహా చాలా లాభాలు ఉంటాయి. హెల్దీ ఫ్యాట్స్ ఉండే ఆరు రకాల ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
అవకాడోల్లో హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. మోనోసాచురేటెడ్ ఫ్యాట్‍కు ప్రయోజనమైన ఓలెయిక్ ఆసిడ్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి అవకాడో చాలా మేలు చేస్తుంది.
Photo: Pexels
సాల్మోన్, సార్డినెస్, టునా లాంటి ఫ్యాటీ చేపల్లో ఒమేగా-3 ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి. పనితీరును మెరుగుపరుస్తాయి.
Photo: Pexels
బాదం, జీడిపప్పు, ఆక్రోటు లాంటి నట్స్‌లో హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్-ఈ, మెగ్నిషియం సహా మరిన్ని విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి పూర్తిస్థాయి ఆరోగ్యానికి సహకరిస్తాయి.
Photo: Pexels
చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ మెండుగా ఉంటుంది. బ్లడ్ ప్రెజర్ తగ్గేందుకు కూడా ఇవి తోడ్పడతాయి. చియా విత్తనాల్లో పోషకాలు ఎక్కువ.
Photo: Pexels
కోడిగుడ్లలో హెల్దీ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ముఖ్యమైన విటమిన్స్, మినరళ్లను కూడా గుడ్లు కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
Photo: Pexels
ఆలివ్ ఆయిల్‍లో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ నూనె గుండె ఆరోగ్యానికి, పని తీరును మెరుగుపరచగలదు.
Photo: Pexels
పురుషులలో వంధ్యత్వం అంటే ఏమిటి, వంధ్యత్వానికి కారణాలేమటి?