ఖర్జూరాలు తింటే కలిగే 6 ప్రయోజనాలు ఇవే

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Sep 19, 2023

Hindustan Times
Telugu

ఖర్జూరాలు (డేట్స్) తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన బెనెఫిట్స్ ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

ఖర్జూరాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇవి తింటే మీ కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బరువు తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. 

Photo: Pexels

ఖర్జూరాల్లో పోలిఫెనోలిక్ పదార్థం ఎక్కుగా ఉంటుంది. దీంతో ఇవి తింటే మీ గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. 

Photo: Pexels

చక్కెరకు బదులుగా తీపి కోసం ఖర్జూరాలను వినియోగించుకోవచ్చు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఖర్జూరాలను తీసుకుంటే శరీరానికి చాలా పోషకాలు కూడా అందుతాయి. 

Photo: Unsplash

ఖర్జూరాల్లో ఫాస్పరస్, కాల్షియమ్, మెగ్నిషియమ్ లాంటి పోషకాలు ఉంటాయి. అందుకే ఇది తింటే శరీరంలోని ఎముకల దృఢత్వం మెరుగుపడుతుంది.

Photo: Pexels

ఖర్జూరాల్లోని పొటాషియమ్.. ఎలక్ట్రోలైట్‍గానూ పని చేస్తుంది. శరీరంలో కండ పెరిగేందుకు, ప్రొటీన్ల కోసం కూడా ఖర్జూరాలు ఉపయోగపడతాయి. 

Photo: Pexels

ఖర్జూరాల్లో యాంటియాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో శరీరంలోని ఇన్‍ఫ్లమేషన్‍ను తగ్గించి.. కొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

Photo: Pexels

దంతాలు పసుపుగా ఉంటే మీరు ఎదుటి వారితో మాట్లాడేందుకు సంకోచిస్తుంటారు. మీ ఆత్మవిశ్వాసంపై ప్రభావం పడుతుంది. ఈ ఏడు ఇంటి చిట్కాలతో దంతాలను తెల్లగా చేసుకోవచ్చు.   

pexels